'కాంజీవరం' తెలుగులో...
ప్రకాష్ రాజ్ కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డును తెచ్చిపెట్టి, జాతీయ ఉత్తమ చిత్రం అవార్డును సైతం కైవసం చేసుకున్న చిత్రం 'కాంజీవరం'. తమిళంలో రూపొందిన ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకుడు. ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోకి అనువదించి విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
తమిళనాడులోని కాంజీపురంలో స్వాతంత్ర్యానికి పూర్వం నేత కార్మికుల పరిస్థితికి అద్దం పడుతూ 'కాంజీవరం' రూపొందింది. ఇందులో నేత కార్మికుడైన ప్రకాష్ రాజ్ తన కలలకూ, కమ్యూనిస్టు భావజాలానికి మధ్య సతమతమయ్యే పాత్రను ప్రతిభావంతంగా పోషించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా నాటి కాలమాన పరిస్థితులను ప్రతిబింబించే విధంగా ప్రియదర్శన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రకాష్ రాజ్ కు జోడిగా శ్రియారెడ్డి నటించింది. పెర్ సెప్ట్ కంపెనీ/ ఫేర్ ఫ్రేమ్ పిక్చర్స్ పతాకంపై శైలేంద్ర సింగ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జి.శ్రీకుమార్ సంగీతం అందించారు. అక్టోబర్ చివరి వారంలో 'కాంజీవరం' చిత్రం తెలుగులో విడుదలవుతుంది.
Be first to comment on this News / Article!
|