రవితేజతో మూడోసారి...
పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లకు మంచి క్రేజ్ ఉంటుంది. ఎంటర్ టైన్ మెంట్ తో పాటు యాక్షన్ జోడించి హిట్లు కొడుతున్న రవితేజ, గ్లామర్ కు కొత్త అర్ధాలు చెబుతూ పెర్ ఫార్మెన్స్ పరంగా కూడా మంచి పేరు తెచ్చుకుంటున్న అనుష్క కాంబినేషన్ ఇలాంటిదే. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'విక్రమార్కుడు' చిత్రం ఈ జంటకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 'బలాదూర్' చిత్రంలోనూ కలిసి నటించారు. తాజాగా ఈ జంటను మరోసారి కలుపుతూ ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సంస్థ ఓ కొత్త చిత్రానికి సన్నాహాలు చేస్తోంది.
రవితేజకు ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ ను తెచ్చిపెట్టిన 'కిక్' చిత్రాన్ని ఆర్.ఆర్.మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాత వెంకట్ నిర్మించారు. ఆ చిత్రం తర్వాత మళ్లీ రవితేజతోనే సంస్థ తదుపరి చిత్రం ప్లాన్ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం ప్రి-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రవితేజ సరసన అనుష్క హీరోయిన్ గా ఎంపికైన ఈ చిత్రంలో రియల్ స్టార్ శ్రీహరి మరో కీలక పాత్ర పోషించనున్నారు. ఈ చిత్రం ద్వారా గోపీచంద్ మలినేని అనే కొత్త డైరెక్టర్ ని పరిచయం చేస్తున్నామనీ, అక్టోబర్ నుంచి షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత వెంకట్ తెలిపారు. ప్రస్తుతం బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న 'నానోడిగళ్' తెలుగు వెర్షన్ (ఇంకా పేరు పెట్టలేదు)లో రవితేజ నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత ఆర్.ఆర్.మూవీ మేకర్స్ చిత్రం, కృష్ణవంశీ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మించనున్న చిత్రం, వంశీ దర్శకత్వంలో 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్' రవితేజ చేతిలో ఉన్నాయి.
Be first to comment on this News / Article!
|