అమితాబ్ తో పూరీ చిత్రం
సంచలన చిత్రాల దర్శకుడు పూరీ జగన్నాథ్ 2010 చివర్లో బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టాలనే పట్టుదలతో ఉన్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో ఈ సినిమా ఉండబోతోంది. ఈ విషయాన్ని పూరీ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
'పోకిరి' చిత్రం హిందీ రీమేక్ ద్వారా బాలీవుడ్ లో అడుగుపెట్టాలని అప్పట్లో అనుకున్నాననీ, రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో ఇది ప్లాన్ చేసినప్పటికీ కార్యాచరణ లోకి రాలేదని పూరీ వెల్లడించారు. అయితే ఇటీవల అమితాబ్ కు ఓ కథ చెప్పడం, ఆయన ఓకే చేయడం జరిగిందన్నారు. ఈ చిత్రం కార్యరూపంలోకి రావడానికి మరో ఏడాది పడుతుందని చెప్పారు. బాలీవుడ్ తో పాటు ఓ ఇంగ్లీషు సినిమాకి కూడా దర్శకత్వంలో వహించాలనే ఆలోచన ఉందనీ, కథ కూడా రెడీ గా ఉందన్నారు. ఈ చిత్రానికి భారీ బడ్జెట్ అవుతుందనీ, అంత ఖర్చుపెట్టి సినిమా తీసేందుకు ఎవరైనా నిర్మాత ముందు వచ్చే తప్పని సరిగా చేస్తాననీ అన్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ రెండు వారల తేడాతో రెండు ప్రాజెక్ట్ లను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ప్రభాస్ హీరోగా పూరీ దర్శకత్వంలో రూపొందిన 'ఏక్ నిరంజన్' చిత్రం భారీ అంచనాల మధ్య అక్టోబర్ 29న విడుదలకు సిద్ధమవుతోంది. పూరీ నిర్మాతగా తన సోదరుడు సాయిరాం శంకర్ తో రూపొందించిన 'బంపర్ ఆఫర్' అక్టోబర్ 9న రిలీజ్ కానుంది. అంటే 20 రోజుల గ్యాప్ లో ఆయన చేసిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయని అనుకోవచ్చు. ఆసక్తికరంగా 'బంపర్ ఆఫర్'లో ఓ ఐటెంసాంగ్ చేస్తున్న బాలీవుడ్ కంగనా రనౌత్...'ఏక్ నిరంజన్'లో హీరోయిన్ గా నటిస్తూ తొలిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అన్నట్టు...పూరీ జగన్నాథ్ తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ హీరోగా
అనౌన్స్ చేశారు. దీనికి 'గోలీమార్' అనే పేరు పెట్టారు. నవంబర్ లో ఈ చిత్రం ఉంటుంది. దీని తర్వాత దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితాన్ని ఆధారంగా చేసుకుని 'రాజశేఖర్ రెడ్డి' అనే చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకురానున్నారు.
Be first to comment on this News / Article!
|