'నిజంగా నేనేనా..!'
రాజీవ్, పంకజ్, శ్రద్ధ హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న కొత్త చిత్రం 'నిజంగా నేనేనా..!'. అట్లూరి వెంకట రంగారావు సమర్పణలో శ్రీ హరిహరా క్రియేషన్స్ పతాకంపై గొట్టుముక్కల గిరి, జి.రామకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జి.రవి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విజయదశమి పర్వదినం సందర్భంగా సోమవారంనాడు ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. నటుడు-నిర్మాత కె.నాగేంద్రబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్రయూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రేమ పేరుతో పెడదోవ పడుతున్న నేటి యువతకు చక్కటి సందేశాన్ని ఇచ్చే విధంగా ఈ చిత్రం ఉంటుందనీ, ప్రేమకంటే స్నేహమే గొప్పదని చాటిచెప్పే చిత్రమిదనీ దర్శకుడు రవి తెలిపారు. అన్ని కమర్షియల్ హంగులతో ఈ చిత్రం తెరకెక్కుతుందన్నారు. ఇందులో మొత్తం 6 పాటలు ఉంటాయని చెప్పారు. ఈనెల 29 నుంచి పాటల రికార్డింగ్ ప్రారంభించి అక్టోబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. రాజమండ్రి, నర్సాపురం, అరకు తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతుందని చెప్పారు. గత పదేళ్లుగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో పనిచేస్తున్న తాను ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతుండటం సంతోషంగా ఉందని రాజీవ్ తెలిపారు. బాలవుడ్, భోజ్ పురి చిత్రాల్లో నటించిన తాను తెలుగు హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉందని మరో హీరో పంకజ్ అన్నారు. చిత్ర సమర్పకుడు అట్లూరి వెంకట రంగారావు, హీరోయిన్ శ్రద్ధ తదితరులు ఈ సందర్భంగా పాల్గొన్నారు. ఈ చిత్రానికి రాజు-జి.రవిశంకర్ రచన, చందు-మధు-సి.విజయ్ కుమార్ మాటలు, రవి.కె.నిర్ల సినిమాటోగ్రఫీ, అనిల్ ఎడిటింగ్, శేఖర్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|