'జయీభవ' ఆడియో 1న
'అతనొక్కడే', 'హరేరామ్' వంటి హిట్ చిత్రాల తర్వాత ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న భారీ చిత్రం 'జయీభవ'. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. నందమూరి హీరోల సమక్షంలో ఈ చిత్రం ఆడియో విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.
కల్యాణ్ రామ్ మాట్లాడుతూ, అక్టోబర్ 1న 'జయీభవ' ఆడియోను ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేస్తున్నట్టు చెప్పారు. థమన్ ఎస్ ఈ చిత్రానికి సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చారనీ, పాటలన్నీ శ్రోతల్ని తప్పనిసరిగా ఆకట్టుకుంటాయనీ అన్నారు. అక్టోబర్ ప్రథమార్ధంలోనే సినిమ విడుదలకు కూడా ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్ర ద్వారా నరేష్ కొండేపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కల్యాణ్ రామ్ కు జోడిగా హన్సిక మోత్వాని నటించిన ఈ చిత్రంలో ముఖేష్ రుషి, ఆశిష్ విద్యార్థి, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మానందం, ఆలీ, రఘుబాబు, వేణుమాధవ్, చలపతిరావు, సుధ, హేమ, బెనర్జీ, వకీల్ ఖాన్ తదితరులు నటించారు. బి.వి.ఎస్.రవి కథ-మాటలు అందించిన ఈ చిత్రానికి
దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ, విజయ్ ఫైట్స్, రాజీవ్ నాయర్ ఆర్ట్, గౌతంరాజు ఎడిటింగ్ అందించారు. మాస్టర్ నందమూరి శౌర్యారామ్ సమర్పకుడుగా వ్యవహరించారు.
Be first to comment on this News / Article!
|