రివైజింగ్ కమిటీకి మహాత్మ?
శ్రీకాంత్ నూరవ చిత్రంగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన చిత్రం 'మహాత్మ'. గోల్డెన్ లయెన్స్ పతాకంపై సి.ఆర్.మనోహర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మహాత్మా గాంధీ ముని మనువడు తుషార్ గాంధీ చేతులమీదుగా ఇటీవలే ఆడియో విడుదలైంది. గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విజయదశమి సందర్భంగా సోమవారంనాడు ఈ చిత్రం సెన్సార్ కు వెళ్లింది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రాన్ని చూసి రివైజింగ్ కమిటీకి పంపాలని నిశ్చయించినట్టు తాజా సమాచారం. బుధవారంనాడు ఈ చిత్రాన్ని రివైజింగ్ కమిటీ తిలకించనుంది.
హింసతో ఏదైనా సాధించవచ్చని నమ్మే దాస్ అనే రౌడీ ఆ తర్వాత మహాత్ముని స్ఫూర్తితో ఆయన ఆశయాల కోసం నడుం బిగిస్తాడు. దాస్ పాత్రను శ్రీకాంత్ పోషిస్తున్నారు. ఆయనకు జోడిగా భావన నటిస్తోంది. పరుచూరి సోదరులు రచన చేసిన ఈ చిత్రానికి సిరివెన్నెల-సుద్దాల అశోక్ తేజ-లక్ష్మీభూపాల్ పాటలు, శరత్ సినిమాటోగ్రఫీ, శంకర్ ఎడిటింగ్, విజయ్ ఆంటోని సంగీతం అందించారు. ఆ చిత్రం ఆంధ్రప్రదేశ్ హక్కులను గీతా ఆర్ట్స్ సొంతం చేసుకుంది.
Be first to comment on this News / Article!
|