సురేష్ బ్యానర్ లో రాణా
డాక్టర్ రామానాయుడు మనువడు, సురేష్ బాబు తనయుడు అయిన రాణా అతి త్వరలోనే 'లీడర్'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ వంటి ప్రిస్టేజియస్ బ్యానర్ ఉన్నప్పటికీ రాణాను బయట బ్యానర్ నుంచి హీరోగా సురేష్ బాబు పరిచయం చేస్తున్నారు. ప్రతిష్ఠాత్మక ఏవియం బ్యానర్ పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లీడర్' నిర్మాణం జరుపుకొంటోంది. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉండటంతో రాణా తదుపరి చిత్రానికి కూడా ప్లానింగ్ జరుగుతోంది. ఈ చిత్రాన్ని సురేష్ బ్యానర్ పై సురేష్ బాబు నిర్మించబోతున్నారు. ఆనంద్ రంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
సిద్దార్ధ-షామిలి జంటగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఓయ్' చిత్రం ద్వారా ఆనందర్ రంగా దర్శకుడిగా మారారు. ఆ చిత్రం కమర్షియల్ పరంగా ఓ మోస్తరు అనిపించుకున్నప్పటికీ థీమ్, ప్రెజెంటేషన్ పరంగా ఆనంద్ రంగా ప్రశంసలు అందుకున్నారు. ఆయన చెప్పిన కథ సురేష్ బాబుకు నచ్చడంతో రాణా తదుపరి చిత్రం దర్శకత్వ బాధ్యతలను అతనికి అప్పగించినట్టు తెలుస్తోంది. మరో రెండు మూడు అగ్ర సంస్థలు కూడా రాణాతో సినిమాలు తీసేందుకు ఆసక్తి చూపుతున్నాయనీ, 'లీడర్' విడుదల తర్వాతే అవి కార్యరూపంలోకి వస్తాయనీ తెలిసింది.
Be first to comment on this News / Article!
|