ఉదయ్ బాబు చిత్రం షురూ
'శ్రీ మేడారం సమ్మక సారక్క మహాత్మ్యం' చిత్రం ద్వారా పరిశ్రమలోకి అడుగుపెట్టిన బాబూమోహన్ తనయుడు ఉదయ్ బాబు హీరోగా ద్వితీయ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు హైద్రాబాద్ లో ప్రారంభమయ్యాయి. రావు వేముగంటి దర్శకత్వంలో ఎడ్ల జోగిరెడ్డి, సత్యనారాయణ గౌడ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా పర్వదినం నాడు ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. ఉదయ్ బాబుపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి నిర్మాతల మండలి అధ్యక్షుడు ఎం.శ్యాంప్రసాద్ రెడ్డి క్లాప్ ఇచ్చారు. సీనియర్ నిర్మాత కె.అచ్చిరెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. పరుచూరి గోపాలకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు.
ఉదయ్ నటించిన తొలి చిత్రం శతదినోత్సవం జరుపుకొందనీ, ద్వితీయ చిత్రం చక్కటి కమర్షిల్ విలువలతో ఉంటుందనీ, మంచి సందేశం కూడా ఈ చిత్రంలో ఉందనీ బాబూమోహన్ తెలిపారు. కథ నచ్చి నిర్మాతలు ఈ సినిమా తీసేందుకు వచ్చారనీ, రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభిస్తామనీ దర్శకుడు వేముగంటి తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సుమన్, కోట శ్రీనివాసరావు, బాబూమోహన్, రామిరెడ్డి, జీవా, రాళ్లపల్లి, గౌతంరాజు, కొండవలస తదితరులు నటిస్తున్నారు. ఆర్.పి.పినిశెట్టి సినిమాటోగ్రఫీ, చక్రి సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|