'విధేయుడు' పాటలు
'ఆ నలుగురు', 'వినాయకుడు' వంటి ఫీల్ గుడ్ చిత్రాలను అందించిన ప్రేమ్ మువీస్ సంస్థ తాజా చిత్రం 'విధేయుడు'. ప్రేమ్ కుమార్ సమర్పణలో సరితా పట్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మీరా దర్శకుడు. నందు, రచన మల్హోత్రా హీరోహీరోయిన్లు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఆడియో సీడీని ఎం.శ్యాంప్రసాద్ రెడ్డి ఆవిష్కరించి గుణశేఖర్ కు అందజేశారు.ఎం.కార్తీక్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో మైత్రి ఆడియోస్ ద్వారా విడుదలైంది. నందు, సాయిమీరా, ప్రేమ్ కుమార్ పట్రా, సరితా పట్రా, కార్తీక్, పరుచూరి వెంకటేశ్వరరావు, అశోక్ కుమార్, త్రినాథ్ మైత్రి, కె.సి.శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, ఈ చిత్ర నిర్మాత గతంలో నిర్మించిన రెండు చిత్రాలు వేటికవే వైవిధ్యమైనవనీ, ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాననీ అన్నారు. చిత్ర దర్శకుడు మీరా తన వద్ద 'ఒక్కడు', 'అర్జున్' సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేసినట్టు గుణశేఖర్ తెలిపారు. మంచి కథలను ఎంచుకుని, కష్టపడే మనస్తత్వం ఉన్న మీరా ఈ చిత్రాన్ని కూడా బాగా తీసే ఉంటారని అనుకుంటున్నట్టు పేర్కొన్నారు. కథను నమ్ముకుని నిర్మాతలు తీసిన రెండు సినిమాలు విజయాన్ని సాధించాయనీ, ఈ సినిమా కూడా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందనీ పరుచూరి వెంకటేశ్వరరావు అన్నారు. నిర్మాతలు మంచి సంస్కారం ఉన్న వారనీ, ఈ చిత్రంతో వారికి హ్యాట్రిక్ సక్సెస్ దక్కాలని కోరుకుంటున్నాననీ కె.సి.శేఖర్ బాబు అన్నారు. అడిషన్ చేసి తనను సెలక్ట్ చేసినట్టు హీరో నందు తెలిపారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. తమ సంస్థ నిర్మిచిన చిత్రాల్లో ఈ చిత్రం అన్నివిధాలా ది బెస్ట్ గా నిలుస్తుందని చిత్ర సమర్పకుడు ప్రేమకుమార్ చెప్పారు.
Be first to comment on this News / Article!
|