అన్నమయ్య సకల దేవతార్చన
స్వర్గీయ కొసరాజు రాఘువయ్య మునిమనుమరాలు కొసరాజు నయన్ తార వర్దమాన గాయనిగా తన ప్రస్థానం ఆరంభించారు. తొలి ప్రయత్నంగా నయన్ తార ఆలపించిన 'అన్నమయ్య సకల దేవతార్చన' అనే పాటల ఆడియో విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. దర్శకేంద్రుడు కె.రాఘువేంద్రరావు ఆడియో క్యాసెట్ ను ఆవిష్కరించి తొలి ప్రతిని డాక్టర్ డి.రామానాయుడుకు అందజేశారు. వెంకటేష్, సురేష్ బాబు, సుమంత్, భారవి, జెమనీ కిరణ్, డాక్టర్ కె.ఎల్.నారాయణ, అరుణ్, రంజన్, భానుప్రసాద్, శ్యామలత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తొలుత డి.రామనాయుడు మాట్లాడుతూ, కొసరాజు రాఘువయ్య తనకు వరుసకు మామయ్య అవుతారనీ, తాను తీసిన సినిమాలకు ఆయన చాలాసార్లు పాటలు రాశారనీ, ఆ పాటలన్నీ మంచి సక్సెస్ ఆయ్యాయనీ అన్నారు. ఆయన మనుమరాలు పాడుతుందని తనకు తెలిసిందనీ, అయితే ఇంత బాగా పాడుతుందని మాత్రం ఇప్పుడే తెలిసిందనీ అన్నారు. భవిష్యత్తులో నయన్ తార మంచి గాయని కావాలని ఆయన ఆశీర్వదించారు. ఇది తన బిడ్డ కార్యక్రమానికంటే ఎక్కువనీ, నయన్ తార పాడిన పాటలు వింటుంటే భక్తిభావంలో ఓలలాడి నేరుగా దైవసన్నిధానానికి తీసుకువెళ్లే విధంగా ఉందనీ అన్నారు. ఇది జీవితంలో మరపురాని రోజనీ, సురేష్ మామయ్యతో పాటు తనకు ప్రోత్సాహం అందించిన అందరికీ కృతజ్ఞతలనీ నయన్ తార పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆల్బమ్ లోని పాటలను ఆమె పాడి వినిపించారు ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది.
Be first to comment on this News / Article!
|