'బాలసుబ్రమణ్యం'గా మనోజ్
'నేను మీకు తెలుసా', 'ప్రయాణం' వంటి వైవిధ్యభరిత చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకత ఏర్పరచుకుంటున్న మంచు మనోజ్ ఇప్పుడు మరిన్ని విలక్షణ ఇతివృత్తాలతో రూపొందుతున్న చిత్రాలలో నటిస్తున్నారు. వీరుపోట్ల దర్శకత్వంలో మంచు మనోజ్ నటిస్తున్న 'బిందాస్...అజయ్ గాడి విజయ గాథ', క్రిష్ దర్శకత్వంలో 'వేదం' నిర్మాణంలో ఉన్నాయి. తాజాగా ఆయన మరో కొత్త చిత్రంలో ప్రఖ్యాత నేపథ్యగాయకుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం అవతారం ఎత్తనున్నారు. దర్శకేంద్రుడు కె.రాఘువేంద్రరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. లక్ష్మీ ప్రసన్న బ్యానర్ పై మోహన్ బాబు ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి 'బాలసుబ్రమణ్యం' అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉంది.
మంచు మనోజ్ సింగర్ బాలసుబ్రమణ్యంగా నటించనున్న ఈ చిత్రంలో మోహన్ బాబు ఓ కీలక పాత్రను పోషించనుండటం విశేషం. కీరవాణి సంగీత అందించనున్నారు. మోహన్ బాబు-రాఘవేంద్రరావు-కీరవాణి కాంబినేషన్ లో 'అల్లరి మొగుడు', 'మేజర్ చంద్రకాంత్' వంటి మ్యూజికల్ హిట్లు గతంలో వచ్చాయి. దీనికితోడు 'మేజర్ చంద్రకాంత్' చిత్రంలో మనోజ్ కుమార్ బాలనటుడిగా కూడా నటించారు. 'బాలసుబ్రమణ్యం' చిత్రాన్ని మ్యూజికల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం పూర్తి వివరాలు వెలుగులోకి రానున్నాయి.
Be first to comment on this News / Article!
|