పోటీలేని వారం
దసరా సీజన్ ను దృష్టిలో పెట్టుకుని 'జోష్', 'ఈనాడు', 'శంఖం', 'గణేష్', 'రెచ్చిపో' వంటి పలు చిత్రాలు సెప్టెంబర్ లో సందడి చేశాయి. ఈ చిత్రాలన్నీ మిశ్రమ ఫలితాలనే చవిచూస్తున్నాయి. దీంతో పలువురు నిర్మాతలు అక్టోబర్ మాసంపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. తొలి శుక్రవారమైన అక్టోబర్ 2న ఉషాకిరణ్ మూవీస్ 'నిన్ను కలిశాక' చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
రామోజీ రావు నిర్మాతగా టీనేజ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన చిత్రం 'నిన్ను కలిశాక'. సీనియర్ డైరెక్టర్ శివనాగేశ్వరరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో 'ప్రేమ్ బాబా' అనే స్పెషల్ రోల్ ను శివనాగేశ్వరరావు పోషించడం విశేషం. సంతోష్, చైతన్య, ప్రియ, డిపాషా హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ఉషాకిరణ్ బ్యానర్ పై రూపొందిన 83వ చిత్రమిది. 'నచ్చావులే' వంటి సక్సెస్ తర్వాత ఈ బ్యానర్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో మళ్లీ యూత్ ను ఈ చిత్రం ఆకట్టుకోవచ్చనే అంచనాలున్నాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ శుక్రవారం 'మహాత్మ' చిత్రం కూడా రిలీజ్ కావలసి ఉంది. శ్రీకాంత్ 100వ చిత్రమిది. కృష్ణవంశీ దర్శకత్వంలో సి.హెచ్.మనోహర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం సెన్సార్ కు వెళ్లి ప్రస్తుతం రివైజింగ్ కమిటీ ముందు ఉంది. దీంతో విడుదల తేదీని ఈ నెల 9వ తేదీకి నిర్మాత వాయిదా వేశారు. ఇదే రోజు పూరీ జగన్నాథ్ నిర్మాతగా ఆయన సోదరుడు సాయిరాం శంకర్ హీరోగా నటించిన 'బంపర్ ఆఫర్' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో తొలి శుక్రవారం ఉషాకిరణ్ మూవీస్ 'నిన్ను కలిశాక' చిత్రం పోటీలేకుండా ఒంటరిగా బరిలోకి దిగుతోంది.
Be first to comment on this News / Article!
|