హిందీలో రవితేజ 'కిక్'
దక్షిణాది చిత్రాల హిందీ రీమేక్ లు ఇప్పుడు బాక్సాఫీస్ హిట్లుగా సంచలనాలు సృష్టిస్తున్నాయి. దీంతో బాలీవుడ్ నిర్మాతలతో పాటు స్టార్ హీరోలు సైతం రీమేక్స్ చేసేందుకు తహతహలాడుతున్నారు. ఈమధ్యనే అమీర్ ఖాన్ 'గజనీ' 90 కోట్లకు పైగా బిజినెస్ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఆ చిత్రాన్ని హిందీలో నిర్మించిన అల్లు అరవింద్ ఇప్పుడు తెలుగు బ్లాక్ బస్టర్ 'మగధీర' ను హిందీలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 40 కోట్ల బడ్జెట్ తో రామ్ చరణ్ కథానాయకుడుగా రాజమౌళి దర్శకత్వంలో అల్లు అరవింద్ తెలుగులో నిర్మించిన 'మగధీర' చిత్రం 65 కోట్లకు పైగా షేర్ (ఓవర్ సీస్ మినహాయించితే) వసూలు చేసింది. ఇప్పుడు ఇదే చిత్రాన్ని 70 కోట్ల బడ్జెట్ తో హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ హీరోలుగా హిందీలో రీమేక్ చేసేందుకు గీతా ఆర్ట్స్ సంస్థ ప్రయత్నాలు మొదలుపెట్టింది. తాజాగా 'కిక్' సైతం హిందీ రీమేక్ కు రెడీ అవుతోంది. రవితేజ, ఇలియానా జంటగా గత సమ్మర్ లో విడుదలైన 'కిక్ ' చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
'కిక్' చిత్రం హిందీలోకి రీమేక్ కానున్న విషయాన్ని సురేందర్ రెడ్డి ధ్రువీకరించారు. ప్రముఖ నిర్మాత సాదిజ్ నడియడ్ వాలా ఈ చిత్రం రైట్స్ ను కొనుగోలు చేశారని ఆయన తెలిపారు. హిందీ వెర్షన్ కు కూడా తననే దర్శకత్వం వహించాలని నిర్మాతలు కోరినప్పటికీ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లతో తాను బిజీగా ఉన్నానని సురేందర్ రెడ్డి తెలిపారు. 'వాంటెడ్' ('పోకిరి' రీమేక్) రీమేక్ తో మళ్లీ సక్సెస్ బాట పట్టిన సల్మాన్ ఖాన్ 'కిక్' రీమేక్ లో నూ నటించే అవకాశాలున్నాయి.
Be first to comment on this News / Article!
|