జి.కె.రెడ్డి 'ఘనుడు' షురూ
ప్రముఖ నిర్మాత జి.కె.రెడ్డి (హీరో విశాల్ తండ్రి) నిర్మిస్తున్న చిత్రం తాజా చిత్రం 'ఘనుడు'. జి.కె.ఫిలిమ్స్ పతాకంపై ఆయన నిర్మిస్తున్న ఈ చిత్రం విజయదశమి రోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దీనికి ధన్ రాజ్ దర్శకుడు. ఈ చిత్రంలో ఓ ప్రముఖ హీరోతో పాటు ఆనంద్ రాజ్ అనే యువకుడ్ని పరిచయం చేస్తున్నట్టు జి.కె.రెడ్డి తెలిపారు.
గ్రామీణ నేపథ్యంలో లవ్, సెంటిమెంట్, యాక్షన్ అంశాలు మిళితం చేసి ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్టు ఆయన తెలిపారు. ఈనెల 12 నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందనీ, అనంతపూర్, రత్నగిరి, హిందుపూర్ పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్ 15 రోజుల పాటు ప్లాన్ చేశామనీ చెప్పారు. రెండో షెడ్యూల్ వైజాగ్, రాజమండ్రి, మూడో షెడ్యూల్ బ్యాంకాక్, స్విట్జర్లాండ్ లో ఉంటుందనీ, నిర్మాణ విషయంలో ఎక్కడా రాజీపడకుండా భారీ తారాగణంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తీయనున్నామనీ చెప్పారు. ఇందులోని ఆరు పాటలు ప్రముఖ సంగీత దర్శకుడి సారథ్యంలో రూపుదిద్దుకుంటాయని సహ నిర్మాతలలో ఒకరైన రాయపాటి మారుతీప్రసాద్ తెలిపారు. నటీనటుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని అన్నారు. కథ-స్క్రీన్ ప్లే సైతం ధన్ రాజ్ అందించనున్న ఈ చిత్రానికి దాసరి బ్రహ్మం సంభాషణలు సమకూర్చనున్నారు.
Be first to comment on this News / Article!
|