పద్మనాభానికి అల్లు అవార్డు
పద్మశ్రీ అల్లు రామలింగయ్య 6వ జాతీయ పురస్కారాన్ని 2009 సంవత్సరానికి గాను సీనియర్ హాస్యనటుడు బసవరాజు పద్మనాభానికి ప్రదానం చేశారు. రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో గురువారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమాన్ని పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య కళాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించారు.
అల్లు అరవింద్ చేతుల మీదుగా పద్మనాభానికి స్వర్ణకంకణ సత్కారం జరుగగా, దర్శకేంద్రుడు కె.రాఘువేంద్రరావు, అల్లు అర్జున్, రామ్ చరమ్ లు ఆయనకు శిరస్త్రాణం తొడిగారు. సీనియర్ నటుడు గుమ్మడి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ, నాన్న నుంచి అర్జున్ వరకూ అందరూ హీరోలు కావడం తాతయ్య చూశారనీ, అయితే తాను హీరో కావడం ఆయన చూడలేదనే బాధ తనకు ఉండిపోయిందనీ అన్నారు. తాతగారి అవార్డును పద్మనాభం గారికి అందించడం వల్ల అవార్డుకు సార్ధకత ఏర్పడిందన్నారు. తనకు జరిగిన సన్మానం, అల్లు జాతీయ అవార్డు ప్రధానం పట్ల పద్మనాభం కృతజ్ఞతలు తెలిపారు. హాస్యం ఉన్నంతవరకూ అల్లు రామలింగయ్య అందరి హృదయాల్లోనూ బతికే ఉంటారనీ, ఆ మహానుభావుడి అవార్డు అందుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నాననీ అన్నారు. ఈ కార్యక్రమంలో కళాపీఠం అధ్యక్షుడు సారిపల్లి కొండలరావు, మాజీ మండ్రి మండలి బుద్ధప్రసాద్, గీతాంజలి, ఏడిద నాగేశ్వరరావు, డాక్టర్ బ్రహ్మానందం, ధర్మవరపు, ఆలీ, జీవా, వేణుమాధవ్, జె.కె.భారవి, శ్రీనివాసరెడ్డి, డాక్టర్ గోపీచంద్, రాళ్లపల్లి, ఎల్బీ శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|