తేజ దర్శకత్వంలో 'అటు-ఇటు'
జయం మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వరుస చిత్రాల నిర్మాణాలకు ప్లాన్ చేస్తున్న తేజ తాజాగా 'అటు-ఇటు' పేరుతో ఓ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. డి.సురేష్ బాబు సమర్పణలో శ్రీవల్లీ తేజ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 'కిక్' ఫేమ్ శ్యామ్ తో పాటు ఓ ప్రముఖ కథానాయిక ఇందులో ముఖ్య పాత్రలు పోషించనున్నారు.
శ్రీవల్లీ తేజ ఆ వివరాలు తెలియజేస్తూ, హీరో హీరోయిన్లు మినహా అన్ని పాత్రల ఎంపిక పూర్తయిందన్నారు. ప్రధాన జంట కోసం 16 నుంత 19 ఏళ్ల లోపు యువతీ యువకులు తమను సంప్రదించవచ్చనీ, తెలుగు వారికి ప్రాధాన్యం ఉటుందనీ తెలిపారు. ఎంపిక పూర్త కాగానే షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పారు. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరనేది ఇంకా నిర్దారించలేదనీ, తేజను దర్శకత్వం వహించమని అడుగుతున్నామనీ తెలిపారు. తనికెళ్ల భరణి, ధర్మవరపు సుబ్రమణ్యం తదితరులు నటించనున్న ఈ చిత్రానికి రసూల్ సినిమాటోగ్రఫీ, నారాయణరెడ్డి ఆర్ట్, కల్యాణి మాలిక్ సంగీతం అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|