విలేజ్ లో వినాయకుడి విహారం
కృష్ణుడు కథానాయకుడుగా విజయవంతమైన 'వినాయకుడు' చిత్రానికి సీక్వెల్ గా మూన్ వాటర్ పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న 'విలేజ్ లో వినాయకుడు' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. సాయికిరణ్ అడవి దర్శకత్వంలో మహి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కృష్ణుడుకు జోడిగా శరణ్య మోహన్ నటిస్తోంది. మణికాంత్ ఖాద్రి స్వరపరచని పాటలు విశేషంగా శ్రోతలని ఆకట్టుకుంటున్నాయనీ, అన్నిచోట్ల నుండి మరిన్ని ఆర్డర్లు వస్తున్నాయనీ నిర్మాత తెలిపారు.
పదిరోజుల క్రితం విడుదలైన ఆడియోకి అద్భుతమైన స్పందన వస్తోందనీ, ఇంటర్నెట్ లో ఎక్కువ హిట్లు వస్తున్నాయనీ చెప్పారు. సీడీలు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయని తెలిపారు. తొలి విడత 50 వేల సీడీలను మార్కెట్ లోకి రిలీజ్ చేశామనీ, రాబోయే రెండు వారాల్లో 2 లక్షల సీడీలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామనీ చెప్పారు. కార్తీక్ (కృష్ణుడు), కల్పన (శరణ్య) జీవితంలో ఎదురయ్యే సమస్యల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందన్నారు. షూటింగ్ ఎక్కువ భాగం రాజోలు పరిసర ప్రాంతాల్లో జరిపామని చెప్పారు. చందమామ పుస్తకంలోని కథలా ఈ చిత్రం ఉంటుందని సాయికిరణ్ అడవి చెప్పారు. ఆడియో పెద్ద సక్సెస్ కావడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెంచిందన్నారు. ఈ నెలలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలో ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. రావు రమేష్, జోగి నాయుడు తదితరులు నటించిన ఈ చిత్రానికి మహి కథ, వనమాలి పాటలు, రమణ సాల్వా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|