నటి భువనేశ్వరి అరెస్టు
వెండితెరపై అందాలను ఆరబోయడంలో స్పెషలిస్ట్ అయిన నటి భువనేశ్వరిని చైన్నై వ్యభిచార నిరోధక విభాగం పోలీసులు శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశారు. వ్యభిచార నేరం కింద ఆమెను అరెస్టు చేసినట్టు చెన్నై వర్గాల ద్వారా తెలిసింది.
ఆ వర్గాల సమాచారం ప్రకారం...అడయార్ లోని ఓ ఇంట్లో కొద్దికాలంగా భువనేశ్వరి వ్యభిచారం నడుపుతోంది. ఈమేరకు ఇరుగుపొరుగు వారి నుంచి పోలీసులకు సమాచారం అందడంతో డిపార్ట్ మెంట్ కు చెందిన ఒక వ్యక్తిని విటుడి వేషంలో అక్కడికి పంపారు. భువనేశ్వరి అతని నుంచి సొమ్ము తీసుకుని ఒక గదిలోకి తీసుకు వెళ్లింది. ముంబైకి చెందిన ఇద్దరు మోడల్స్ అప్పటికే ఆ రూమ్ లో వేచి ఉన్నారు. ఈ విషయాన్ని అతను తెలివిగా బయటకు చేరవేయడంతో పోలీసులు ఇంట్లోకి ప్రవేశించి రెడ్ హ్యాండెడ్ గా భువనేశ్వరిని అదుపులోనికి తీసుకున్నారు. పట్టుబడిన ఇద్దరు మోడల్స్ ను మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరు పరచి అట్నించి అటు మైలాపూరులోని గవర్న్ మెంట్ హోమ్ కు పంపారు. తెలుగు, తమిళ సినిమాల్లోనూ, పలు టీవీ సీరియల్స్ లోనూ నటించిన భువనేశ్వరి వ్యభిచార గృహం నడుపుతోందనే అభియోగంపై 2002లో కూడా ఒకసారి అరెస్టయింది. ఆ తర్వాత ఆమెను విడిచిపెట్టారు. తాను వ్యభిచారం చేయడంలేదనీ, తన స్నేహితులతో సరదాగా గడుపుతుంటే అరెస్టు చేశారనీ అప్పట్లో భువనేశ్వరి వివరణ ఇచ్చింది. తాజా సంఘటనలో తమిళనాడు వ్యభిచార నిరోధక చట్టం సెక్షన్ 3,4,5 కింద ఆమెపై కేసు నమోదు చేసినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.
Read 3 Comment(s) posted so far on this News / Article!
|