స్టార్స్ క్రికెట్ డిసెంబర్ 13న
ఒక మంచి కారణంతో ఏటా డిసెంబర్ మాసంలో వచ్చే రెండో ఆదివారం స్టార్ క్రికెట్ నిర్వహించడమనే సంప్రదాయం తెలుగు సినీ పరిశ్రమలో ఉంది. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ లలో బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి పలువురు స్టార్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంటారు. ఈసారి కూడా స్టార్స్ టి-20 మ్యాచ్ నిర్వహించేందుకు మూవీ ఆర్టిస్టస్ అసోసియేషన్ (మా) సన్నాహాలు చేస్తోంది. డిసెంబర్ 13న ఈ స్టార్ క్రికెట్ మ్యాచ్ జరగనుందని సినీ విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
మూవీ ఆర్టిస్ట్స్ అసోయేషన్ తీవ్రమైన నిధుల కొరతను ఎదుర్కొంటోందనీ, ఇందువల్ల సంక్షేమ పథకాల కొనసాగింపు కష్టతరంగా ఉందనీ తెలుస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని పేద సినీ కళాకారుల ఆర్థిక సహాయం కోసం 'టి-20' మ్యాచ్ ద్వారా నిధుల సమీకరణ జరపాలని 'మా' భావిస్తోంది. ఈ ఈవెంట్ కు సహకరించాల్సిందిగా పరిశ్రమకు చెందిన 24 శాఖలను అసోసియేషన్ కోరనుంది. స్టార్స్ క్రికెట్ మ్యాచ్ కు సంబంధించిన ఈవెంట్ మేనేజ్ మెంట్ ను వి.రవికుమార్ (విఆర్ కె ఈవెంట్ సొల్యూషన్స్)కు అప్పగించనున్నారు. ఈ ఈవెంట్ వివరాలను 'మా' అధ్యక్షుడు మురళీ మోహన్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
Be first to comment on this News / Article!
|