మెర్సీ కిల్లింగ్ 'చేత వెన్నముద్ద'
కృష్ణుడు ('వినాయకుడు' ఫేమ్) కీలక పాత్రలో, క్రితిక క్రిష్టన్ ('హ్యాపీడేస్' ఫేమ్) హీరోయిన్ గా ఫుల్ మూన్ పిక్చర్స్ పతాకంపై పి.ఆర్.కుమార్ నిర్మిస్తున్న చిత్రం 'చేత వెన్నముద్ద'. రోహిత్ ఎస్.అభ్యుదయ్ దర్శకుడు. తెలుగులో తొలిసారిగా మెర్సీ కిల్లింగ్ పై నిర్మిస్తున్న చిత్రమిది. ఈ చిత్రం ఏభై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఎమ్.భరత్ కుమార్ తెలిపారు.
కృష్ణుడు, స్పెయిన్ అమ్మాయి అన్నా జెన్, మెటిల్డా, మైక్, శశిలపై ఇటీవల తీసిన కొన్ని కామెడీ సన్నివేశాలతో సగం సినిమా పూర్తయిందనీ, ఈనెల ద్వితీయార్థం నుంచి జరిగి షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తవుతుందనీ ఆయన చెప్పారు. గాఢంగా ప్రేమించుకున్న ఇద్దరు ప్రేమికుల మధ్య ఏర్పడ్డ శూన్యతను కాలం ఎలా పరిష్కరించిందనేది ఈ చిత్ర కథాంశమని దర్శకుడు రోహిత్ తెలిపారు. తెలుగులో తొలిసారిగా మెర్సీకిల్లింగ్ పై నిర్మిస్తున్న చిత్రమిదని సహ నిర్మాత జానకిరామ్ చెప్పారు. హీరో అల్తాఫ్, క్రితిక క్రిష్ణన్ లపై చిత్రీకరించిన ప్రేమ సన్నివేశాలు ప్రేమికుల్లో కొత్త అనుభూతిని కలిగిస్తాయనీ, ప్రేమికులంతా చూడదగిన ప్రేమకథా చిత్రమనీ చెప్పారు. చివరి షెడ్యూల్ లో రెండు పాటలు చిత్రీకరిస్తామని తెలిపారు. నెలాఖరులో ఆడియో, నవంబర్ లో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. సినిమా ప్రారంభం నుంచి పూర్తయ్యేంత వరకూ కృష్ణుడు ప్రేక్షకులను నవ్విస్తూనే ఉంటారనీ, మెర్సీకిల్లింగ్ పై రూపొందుతున్న కొత్త కాన్సెప్ట్ ను తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉందనీ చిత్ర సమర్పకుడు బెల్లంకొండ రఘు తెలిపారు. ఈ చిత్రానికి వి.ఎన్.సతీష్ కథ, మోహన్ తుమ్మల మాటలు, రవిస్వరూపన్ పాటలు, రవి కె నీర్ల సినిమాటోగ్రఫీ, రవిస్వరూపన్-లావణ్య సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|