ప్రకాష్ రాజ్-భూమిక చిత్రం
జాతీయ ఉత్తమ నటుడు ప్రకాష్ రాజ్, అందాల నటి భూమిక జంటగా ఓ కొత్త చిత్రం తెరకెక్కుతోంది. అమోద్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వి.వనతిరాణి, ఎ.రాధికా రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టేకుల కృపాకర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. విజయదశమి రోజున నిరాడంబరంగా ప్రారంభమైన ఈ చిత్రం శరవేగంగా తొలి షెడ్యూల్ ప్రారంభించుకుంది. తొలిసారిగా ఆ చిత్ర విశేషాలను యూనిట్ సభ్యులు తెలియజేశారు.
భార్యాభర్తల మధ్య ఉండాల్సిన బంధాలు, అనురాగాలు, ఆప్యాయాతల చుట్టూ ఈ కథ తిరుగుతుందని దర్శకుడు కృపాకర్ రెడ్డి తెలిపారు. దంపతుల మధ్య అవగాహన సవ్యమైన దిశలో ఉండే సంసారం ఎలా ఉంటుంది? అవగాహన కుదరకపోతే ఆ సంసారం ఎలా ఉటుందనేది ఈ చిత్రంలో చర్చిస్తున్నామని ఆయన చెప్పారు. తొలి షెడ్యూల్ పూర్తయిందనీ, ఈనెల 15న మరో షెడ్యూల్ ప్రారంభమై నవంబర్ లో పూర్తవుతుందని తెలిపారు. డిసెంబర్ లో నిర్మాణాంతర కార్యక్రమాలు జరిపి 2010 జనవరిలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రానికి పరుచూరి సోదరులు రచన, పూర్ణ సినిమాటోగ్రఫీ, గౌతంరాజు ఎడిటింగ్, చిన్నా సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|