జగపతిబాబు ఛేజింగ్...
జగపతిబాబు, ప్రియమణి జంటగా కెబిసి సినిమా పతాకంపై కుమార్ బ్రదర్స్ నిర్మిస్తున్న తాజా చిత్రం హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరణ జరుపుకొంటోంది. జగపతిబాబు, ఫైటర్లు ఇందులో పాల్గొంటున్నారు. ఈ చిత్రం ద్వారా కార్తికేయ గోపాలకృష్ణ దర్శకుడిగా పరిచయవుతున్నారు.
సెట్స్ లో చిత్రం ప్రోగ్రస్ ను నిర్మాతలు తెలియజేస్తూ, వైవిధ్యమైన కథ-కథనాలతో పూర్తి కమర్షియల్ అంశాలు మేళవించి ఈ చిత్రం తెరకెక్కుతోందని అన్నారు. ఈనెల 5 నుంచి హైద్రాబాద్ లో జగపతిబాబుపై ఫైట్ మాస్టర్ గణేష్ ఆధ్వర్యంలో ఛేజింగ్ లు, భారీ యాక్షన్ ఎపిసోడ్లు చిత్రీకరిస్తున్నామనీ, ఈనెల 13 వరకూ తొలి షెడ్యూల్ జరుగుతుందనీ తెలిపారు. రెండో షెడ్యూల్ ఈనెల 26 నుంచి నవంబర్ 10 వరకూ జరుగుతుందనీ, 22 నుంచి డిసెంబర్ చివరి వారం వరకూ జరిగే చివరి షెడ్యూల్ తో సినిమా పూర్తవుతుందనీ చెప్పారు. దర్శకుడు కార్తికేయ మాట్లాడుతూ, నవరసాల సమ్మేళనంతో అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించే విధంగా ఈ చిత్రం ఉంటుందనీ, జగపతిబాబు, ప్రియమణి పాత్రలు సినిమాకి హైలైట్ గా ఉంటాయనీ చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కోట శ్రీనివాసరావు, సత్యప్రకాష్, నాజర్, సివిఎల్ నర్సింహారావు, యుపి రాజు, ప్రగతి, సుధ, సత్యం రాజేష్, సుమన్ శెట్టి తదితరులు నిటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్.శ్యామ్ మనోహర్ కథ-స్క్రీన్ ప్లే, శ్యామ్, మడూరి మధు మాటలు, మారో పళనీ కుమార్ సినిమాటోగ్రఫీ, గౌతంరాజు ఎడిటింగ్, చిన్ని చరణ్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|