దీపావళి ధమాకా...
దసరా తర్వాత వచ్చే దీపావళి పండుగ సహజంగా కొత్త సినిమా రిలీజ్ లకు అనువగా ఉంటుంది. అయితే ఈసారి దసరా సీజన్ కు పలు పెద్ద సినిమాలు పోటీపడినప్పటికీ బాక్సాఫీస్ ను ఆకట్టుకునే సరైన సినిమా పడలేదు. ఈ క్రమంలో దీపావళి సీజన్ కు దగ్గర్లో పలువురు నిర్మాతలు తమ కొత్త చిత్రాల రిలీజ్ కు ప్లాన్ చేసినప్పటికీ ఇటీవల వచ్చిన వరదల వల్ల కొన్ని రీలీజ్ కు వెనక్కి వెళ్లాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితి కుదుటపడుతుండటంతో మళ్లీ నిర్మాతలు తమ కొత్త చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈసారి దీపావళికి రెండు చిత్రాలు బరిలో ఉన్నాయి. వీటిలో పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ గా మీడియం బడ్జెట్ తో రూపొందిన 'బెండు అప్పారావు ఆర్ఎంపి' ఒకటి కాగా, మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం 'ఘటికుడు' మరొకటి. ఒకరోజు తేడాతో ఈ రెండు చిత్రాలు ప్రేక్షకులను అలరించబోతున్నాయి.
వెండితెరపై నవ్వుల పూవులు పూయిస్తున్న అల్లరి నరేష్ కథానాయకుడుగా శ్రీ సురేష్ ప్రొడక్షన్స ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై డి.రామానాయుడు నిర్మించిన చిత్రం 'బెండు అప్పారావు'. కామెడీ చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన ఇవివి సత్యనారాయణ ఈ చిత్రానికి దర్శకుడు. ఓ గ్రామంలో ఉంటూ మందులకు కూడా లొంగని రోగాలను నవ్వుతూ మాయం చేసే చలాకీ డాక్టర్ ఇతివృత్తంతో ఈ చిత్రం రూపొందింది. ఇవివి దర్శకత్వం వహించిన 49వ చిత్రమిది. అల్లరి నరేష్ సరసన కామ్న జెఠ్మలాని, మేఘన హీరోహీరోయిన్లుగా నటించారు. కోటి సంగీతం అందించారు. ఈనెల 16న విడుదలవుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. అలాగే...దీపావళి కానుకగా తమిళ సూర్య సూర్య 'ఘటికుడు'గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. సూర్యకు జోడిగా నయనతార నటించిన ఈ చిత్రాన్ని తమిళంలో 'ఆదవన్' పేరుతో రూపొందించారు. దీనికి తెలుగులో 'ఘటికుడు' పేరిట చందన రమేష్ విడుదల చేస్తున్నారు. కె.ఎస్.రవికుమార్ దర్శకుడు. ఎంతటి క్లిష్లమైన సమస్యనైనా సునాయాంశంగా పరిష్కరించడంలో ఘటికుడైన హీరో కథే ఈ చిత్రం. సూర్య ఇందులో పదేళ్ల కుర్రాడిగా నటించడం, దక్షిణాఫ్రికాలోనే 5 కోట్ల భారీ వ్యయంతో చిత్రీకరించిన క్లైమాక్స్ ప్రధాన హైలైట్స్ కానున్నాయి. 17న ఈ చిత్రం విడుదల కానుంది. అల్లరి నరేష్ హాస్యం, సూర్య శౌర్యంలో ఎవరిది పైచేయి అవుతుందనే ఈ వారాంతంలోనే తేలనుంది.
Be first to comment on this News / Article!
|