డిటియస్ 'జోరు'
ఏ వయసు ముచ్చట ఆ వయసుది. యూత్ లో జోరు సహజం. అలాంటి కథా కథనాలతో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా 'జోరు' చిత్రం తెరకెక్కుతోంది. అరవింద్ కుమార్, ఆకర్ష ఈ చిత్రం ద్వారా హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. సినిమా టాకీస్ పతాకంపై ఎస్.మల్లేషం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం డబ్బింగ్, ఎడిటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిటిఎస్ మిక్సింగ్ కార్యక్రమాలు జరుపుకొంటోంది.
ఎమోషనల్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోందనీ, ఇందులో యూత్ కు చక్కటి సందేశం ఉంటుందనీ నిర్మాత తెలిపారు. చక్రి సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. ఈ నెల మూడో వారంలో ఆడియో, నవంబర్ లో సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలో సాయికుమార్ ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తుండగా, ఎల్బీ శ్రీరామ్, వైజాగ్ ప్రసాద్, గుండు హనుమంతరావు, సుమన్ శెట్టి, మేల్కొటి, అనిల్, ఫిష్ వెంకట్, గీతాంజలి, సన ఇతర పాత్రలు పోషిస్తున్నారు. సినిమా టాకీస్ టీమ్ ఈ చిత్రానికి కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం అందిస్తుండగా, మరుధూరి రాజా మాటలు, చంద్రబోస్-అనంత శ్రీరామ్, కందికొండ పాటలు, వి.జయరాం సినిమాటోగ్రఫీ, నందమూరి హరి ఎడిటింగ్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|