'మహాత్మ'కు మంచి రెస్పాన్
హీరో శ్రీకాంత్ 100వ చిత్రంగా క్రియేటవ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ఈనెల 9న విడుదలైన 'మహాత్మ' చిత్రం విడుదలైన అన్ని కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతోందని ఆ చిత్ర నిర్మాత సి.ఆర్.మనోహర్ సంతోషం వ్యక్తం చేశారు.. మంచి టాక్ తో పాటు చక్కటి కలెక్షన్లు కూడా వసూలవుతునాయని చెప్పారు. 'మహాత్మ' చిత్రానికి వస్తున్న స్పందనపై హైద్రాబాద్ లో సోమవారంనాడు ఆయన ముచ్చటించారు.
రాష్ట్రవ్యాప్తంగా భారీ ప్రింట్లతో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశామనీ, హైద్రాబాద్ లో 40కు పైగా థియేటర్లలోనూ, బెంగుళూరులో 20 థియేటర్లలోనూ సినిమా రిలీజ్ చేశామని ఆయన చెప్పారు. విడుదలైన రెండో రోజే మంచి స్పందన వచ్చిందనీ, దీంతో మరిన్ని ప్రింట్లు కూడా పెంచామనీ చెప్పారు. రాష్ట్రేతర ప్రాంతాలతో పాటు, ఓవర్ సీస్ లోనూ మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. క్రియేటివ్ దర్శకుడుగా పేరున్న కృష్ణవంశీ ఈ చిత్రానికి ఎంతో కష్టపడ్డారనీ, తన క్రియేటివిటీని మరోసారి నిరూపించుకున్నారనీ అన్నారు. సూపర్ 35 కెమెరాతో షూటింగ్ జరిపామనీ, ఫోటోగ్రఫీ చాలా బాగుందని అందరూ ప్రశంసిస్తున్నారనీ చెప్పారు. డిఫరెంట్ గా చేసిన క్లైమాక్స్ కు కూడా మంచి స్పందన వస్తోందన్నారు. విజయ్ ఆంటోని సంగీతం అందించిన పాటలు, పరుచూరి బ్రదర్స్ సంభాషణలకు కూడా ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వస్తోందన్నారు. గాంధేయవాదం గురించి తీసిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుంటూ దిగ్విజయంగా ప్రదర్శితమవుతుండటం తమకెంతో సంతోషం కలిగిస్తోందనీ, తమ కష్టానికి తగిన ఫలింత లభించిందనీ అన్నారు.
Be first to comment on this News / Article!
|