'శక్తి'గా ఎన్టీఆర్
దర్శకుడు మెహర్ రమేష్ కు రెండక్షరాల టైటిల్స్ సెంటిమెంట్ గా మారినట్టుంది. కన్నడంలో రెండు హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మెహర్ రమేష్ తెలుగులో ఎన్టీఆర్ 'కంత్రి' తో దర్శకుడుగా పరిచయమయ్యారు. ఎన్టీఆర్ ను అంతవరకూ ఎవ్వరూ చూపని విధంగా స్టైలిష్ గా, గ్లామర్ లుక్ తో చూపించిన మెహర్ రమేష్ ఇటీవల ప్రభాస్ కు 'భిల్లా'తో న్యూలుక్ ఇచ్చారు. తాజాగా మెహర్ రమేష్ మరోసారి ఎన్టీఆర్ తో కొత్త చిత్రానికి సన్నాహాలు మొదలుపెట్టారు. ఎన్టీఆర్ కు ఉన్న క్లాస్ అండ్ మాస్ అడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రానికి 'శక్తి' అనే టైటిల్ ను అనుకుంటున్నారు. 'కంత్రి' చిత్రాన్ని అందించిన వైజయంతీ మూవీస్ అధినేత సి.అశ్వనీదత్ మరోసారి ఈ చిత్రానికి భారీ బడ్జెట్ తో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించబోతున్నారు.
మెహర్ రమేష్ చెప్పిన స్టోరీలైన్ నచ్చడంతో ఎన్టీఆర్ ఈ కొత్త ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డిసెంబర్ 10 నుంచి వారణాసిలో షూటింగ్ మొదలుపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అశ్వనీదత్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'ఇంద్ర' షూటింగ్ కూడా అప్పట్లో వారణాసిలోనే మొదలైంది. వారణాసితో పాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాలు, విదేశాల్లో కూడా 'శక్తి' చిత్రం షూటింగ్ కు ప్లాన్ చేస్తున్నారు. 'రాఖీ' చిత్రంలో ఎన్టీఆర్ కు జోడిగా నటించిన ఇలియానా ఈ కొత్త చిత్రంలో కథానాయికగా ఎంపికైంది. ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణిశర్మ సంగీతం అందించబోతున్నారు.
Be first to comment on this News / Article!
|