ఎన్టీఆర్-ఆనుష్క ఆటపాట
భూమిక, భరత్ ఠాగూర్ దంపతులు సొంతంగా నిర్మాణరంగంలోకి దిగి 'డౌన్ టౌన్ ఫిలిమ్స్' బ్యానర్ పై నిర్మిస్తున్న తొలిచిత్రం 'తకిట తకిట'. భూమిక కథానాయికగా కొత్త నటీనటులతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం హైద్రాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. పరిశ్రమతో తనకున్న స్నేహ సంబంధాలను పురస్కరించుకుని ఈ చిత్రంలో టాప్ స్టార్స్ లతో గెస్ట్ ఎప్పియరెన్స్ ఇప్పించేందుకు భూమిక చురుగ్గా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే నటి అనుష్కను ఇటీవల ఓ స్పెషల్ సాంగ్ కు ఒప్పించారు. యోగా మాస్టర్ భరత్ ఠాకూర్ అనుష్కకు గురువు కావడం వల్ల కూడా ఈ ఆఫర్ ను అనుష్క అంగీకరించిదట. తాజా సమాచారం ప్రకారం అనుష్కతో కలిసి స్పెషల్ సాంగ్ లో నటించేందుకు యంగ్ స్టార్ ఎన్టీఆర్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 'సింహాద్రి'లో చిత్రంలో ఎన్టీఆర్ తో కలిసి నటించినప్పటి నుంచి ఆ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. అయితే ఎన్టీఆర్-అనుష్క కలిసి స్క్రీన్ పై కనిపించనుండటం మాత్రం ఇదే ప్రథమం. త్వరలోనే ఈ జంటపై అన్నపూర్ణ స్టూడియోస్ లో పాట చిత్రీకరణకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఎన్టీఆర్, అనుష్కలతో పాటు యవసామ్రాట్ నాగార్జున సైతం ఈ చిత్రంలో ఓ గెస్ట్ రోల్ పోషించేందుకు అంగీకరించినట్టు యూనిట్ వర్గాల కథనం. టాప్ స్టార్స్ ను ఈ ప్రాజెక్ట్ కు ఒప్పించడం ద్వారా తమ బ్యానర్ తొలి చిత్రాన్ని పెద్ద సక్సెస్ చేయాలనే పట్టుదలతో భూమిక ఉంది. భూమికతో 'సత్యభామ' చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీహరి నాను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 'యమదొంగ' 'మగధీర', 'అరుంధతి' చిత్రాల ఫేమ్ సెంథిల్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|