'ఒక తుపాకి మూడు పిట్టలు'
ప్రముఖ కమెడియన్ ధర్మవరపు సుబ్రమణ్యం తొలిసారి కథానాయకుడుగా నటిస్తున్న చిత్రానికి 'ఒక తుపాకి మూడు పిట్టలు' అనే టైటిల్ ఖరారు చేశారు. ధర్మవరపు సరసన అభినయశ్రీ, అనుష్కా రాయ్, షఫాలీ శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై రాజా ఆర్.ఆర్. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ కుమార్ దర్శకుడు. ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
సరికొత్త కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి 'ఒక తుపాకి మూడు పిట్టలు' అనే టైటిల్ యాప్ట్ గా ఉంటుందని భావించి ఖరారు చేసినట్టు రామ్ కుమార్ తెలిపారు. ధర్మవరపు, అనుష్కా రాయ్, షఫాలీ శర్మలపై ఇటీవల శ్రీశైలం, వికారాబాద్ అడవుల్లో షూటింగ్ జరిపామనీ, కమెడియన్లు అంతా పాల్గొనగా హీరోహీరోయిన్లపై ఛేజింగ్ దృశ్యాలు తీశామనీ చెప్పారు. దీంతో తొలి షెడ్యూల్ పూర్తయిందని అన్నారు. ఈనెల 16 నుంచి వికారాబాద్, నర్సాపూర్ అడవుల్లో రెండో షెడ్యూల్ ప్లాన్ చేసినట్టు నిర్మాత రాజా తెలిపారు. హీరోహీరోయిన్లతో పాటు సూర్య, ఎల్బీ శ్రీరామ్, బ్రహ్మానందం, అశోక్ కుమార్, గుండు హనుమంతరావు తదితరులు ఈ షెడ్యూల్ లో పాల్గొంటారని చెప్పారు. విభిన్నమైన కథ, వినూత్నమైన మాటలు అందించే అవకాశం ఈ చిత్రంతో కలిగినట్టు సంభాషణల రచయిత దీపికా రాజు తెలిపారు. కథ-స్క్రీన్ ప్లే సైతం రామ్ కుమార్ అందించిన ఈ చిత్రానికి పైడాల శ్రీనివాస్ సినిమాటోగ్రఫీ, రమేష్ ఎడిటింగ్, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందిస్తున్నారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|