'డిసెంబర్ 31' రెడీ
ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తనకు జరిగిన అన్యాయాన్ని ఏ విధంగా ఎదుర్కొందనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం యాక్షన్ ఎంటర్ టైనర్ 'డిసెంబర్ 31'. శ్రీ వినాయక యాడ్స్ సమర్పణలో నవ్యసాయి ఫిలింస్ బ్యానర్ పై నూత నిర్మాతలు బి.వినాయక్, నరసింహ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. కట్టా శ్రీకర్ ప్రసాద్ దర్శకుడు. ఈ చిత్రం ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని తొలికాపీ కూడా సిద్ధ చేసుకుంది.
సాప్ట్ వేర్ ఇంజనీర్ అయిన అభినయశ్రీ తనకు జరిగిన అన్నాయన్ని ఎదిరించే అమ్మాయిగా చక్కటి నటన ప్రదర్సించినట్టు నిర్మాత బి.వినాయక్ తెలిపారు. అభినయశ్రీ ఇంతవరకూ చేయని అద్భుతమైన క్యారెక్టర్ ఇదనీ, తన అభినయంతో మాస్ ఆడియెన్స్ ను ఆమె సమ్మోహితులను చేస్తుందనీ చెప్పారు. త్వరలోనే ఆడియో విడుదల చేసిన ఆ వెనువెంటనే సినిమా విడుదల చేస్తామని ఆయన చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సంజయ్ రాజ్, చలపతిరావు, జీవి, నూతన్ ప్రసాద్, మేల్కొటె, ప్రసాద్ బాబు తదితరులు నటించారు. శ్రీను వెంగళ సినిమాటోగ్రఫీ, అనూరాధ నృత్యాలు, వేణు పెద్దు ఎడిటింగ్, జయంత్ ఓగిరాల సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|