'ఏడుకొండలవాడా..' ఆడియో
సురేంద్ర హీరోగా కొర్రపాటి రమణ సమర్పణలో శ్రీ కాశీనాయన కళామందిర్ పతాకంపై గుండ్లకుంట శ్రీరాములు నిర్మించిన చిత్రం 'ఏడుకొండలవాడా..వెంకటరమణా...అందరూ బాగుండాలి'. సూర్య ఇంజమూరి దర్శకుడు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. సీనియర్ నిర్మాత డాక్టర్ వి.బి.రాజేంద్రప్రసాద్ ఆడియో సీడీని ఆవిష్కరించి తమ్మారెడ్డి భరద్వాజ, సాగర్, దైవజ్ఞ శర్మలకు అందించారు. డిఎస్ రావు, ఎస్.ఎన్.ప్రసాద్, సుదర్శన్, శివారెడ్డి, సూర్య ఇంజమూరి, గుండ్లకంటి శ్రీరాములు, సురేంద్ర, ఘంటాడికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఘంటాడికృష్ణ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో సుప్రీం మ్యూజిక్ ద్వారా విడుదలైంది.
వి.బి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, ఇవాళ నిర్మాతలు తగు జాగ్రత్తలు తీసుకుని సినిమాలు తీయాల్సిన పరిస్థితి ఉందనీ, ఈ చిత్రం విజయం సాధించి నిర్మాతలకు మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాననీ అన్నారు. ఘంటాడికృష్ణ తాను తీసిన కొన్ని చిత్రాలకు సంగీతం అందించారనీ, ఈ సినిమాకి కూడా మంచి సంగీతం అందించాడని అనుకుంటున్నాననీ సాగర్ పేర్కొన్నారు. వ్యాపారాత్మక విలువలతో దర్శకుని అభిరుచి మేరకు పాటలు చేశాననీ, అందర్నీ అలరిస్తాయని ఆశిస్తున్నాననీ ఘంటాడికృష్ణ అన్నారు. పల్లెకూ పట్నానికి ఉన్న వ్యత్యాసాన్ని ఈ సినిమాలో చూపెడుతున్నట్టు నిర్మాత శ్రీరాములు పేర్కొన్నరు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఇందులో వినోదం జోడించి చూపించామని దర్శకుడు సూర్య తెలిపారు. సీనియర్ నటులంతా తనకు ఎంతో సహకరించారని హీరో సురేంద్ర పేర్కొన్నారు.
Be first to comment on this News / Article!
|