హీరోయిన్లకు ఎన్టీఆర్ ట్రాప్?
రాష్ట్రంలో ఏర్పడిన వరదల కారణంగా నష్టపోయిన ప్రజానీకాన్ని అదుకునేందుకు పరిశ్రమలోని అన్ని శాఖల సమన్వయంతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసోయేషన్ (మా) నవంబర్ 7న తలపెట్టిన 'స్టార్ నైట్'కు సంబంధించిన ఓ గురుతర బాధ్యత ఎన్టీఆర్ భుజస్కంధాలపై పడింది. 'మా' సమావేశం ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే బాలకృష్ణ చొరవ తీసుకోగా, తెలుగులో నటించిన బాలీవుడ్ హీరోయిన్లను 'స్టార్ నైట్'కు రప్పించే బాధ్యతను ఎన్టీఆర్ తీసుకోవాల్సిందిగా డాక్టర్ ఎం.మోహన్ బాబు తనంత తానుగా ఓ ప్రపోజల్ చేశారు.
'బాలీవుడ్ హీరోయిన్లు పలువురు తెలుగులో కూడా నటిస్తున్నారు. ముంబైకి చెందిన ఇంచుమించు అందరి హీరోయిన్లతో ఎన్టీఆర్ నటించారు. ఇవాల్టి యంగ్ జనరేషన్ హీరోలను లీడ్ చేస్తున్న వారిలో ఎన్టీఆర్ కూడా ఉన్నాడు. అతను చొరవ తీసుకుని బాలీవుడ్ హీరోయిన్లను స్టార్ నైట్ కు రప్పించే బాధ్యత తీసుకోవాలి' అని మోహన్ బాబు ఓ ప్రతిపాదన చేశారు. నిజానికి నటుడిగా నాలుగు దశాబ్దాల అనుభవం, 50 చిత్రాల నిర్మాత, ఇంట్లోనే ఇద్దరు యువహీరోలు ఉన్న మోహన్ బాబు తలుచుకుంటే బాలీవుడ్ తారలు దిగిరారూ? బుడ్డోడి మీద పెద్ద బాధ్యతే పెట్టారు.
Be first to comment on this News / Article!
|