బాధితులను ఆదుకున్న రామ్
రాష్ట్రంలో సంభవించిన వరదల కారణంగా నష్టపోయిన బాధితులను చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు భారీ విరాళాలు, ఆహార, సహాయక సామాగ్రి పంపిణీతో ఆదుకుంటున్నారు. హీరో రామ్ సైతం తన వంతు సహాయాన్ని బాధితులకు అందించడం ద్వారా తన పెద్ద మనసును చాటుకున్నారు. 3 లక్షల రూపాయలు విలువ చేసే బియ్యం, ఆహార పొట్లాలు, వంట సామానులు ఖరీదు చేసి తన అభిమానుల ద్వారా బాధితులకు అందేలా చేశారు.
రామ్ తరఫున ఆయన అభిమానులు రమేష్, నాగు, కిరణ్, రాందాసు, రాములు, రమణ తదితరులు కర్నూలు జిల్లా పరదంపాడు, కల్లూరు, సింగారం, మేడ్చురు, పంచలింగాల గ్రామాల్లో వరద బాధితులకు ఈ సహాయాన్ని అందించారు. ఇటీవల బ్రహ్మానందం సైతం లక్ష రూపాయలు విలువ చేసే సహాయ సామాగ్రితో ఓ టీమ్ ను పంపి వరద బాధిత ప్రాంతాల్లో పంపిణీ చేశారు. సీనియర్ నటి జమున సైతం ఇటీవల 15 క్వింటాళ్ల బియ్యాన్ని బాధితులకు పంపారు.
Be first to comment on this News / Article!
|