తరుణ్ 'చక్కనైన అబ్బాయి'
తరుణ్, విమలారామన్ జంటగా ప్రణవ్ స్టూడియోస్ సమర్పణలో సుప్రీమ్ మూవీస్ పతాకంపై రాజు హిర్వాని, గోగినేని శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి 'చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు తెలిసింది. ఈ చిత్రానికి కన్మణి దర్శకత్వం వహిస్తున్నారు. తొలుత వి.ఎన్.ఆదిత్య దర్శకుడిగా ఉన్నారు. ఇప్పటికే బ్యాంకాక్ లో భారీ షెడ్యూల్ తో 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజా షెడ్యూల్ హైద్రాబాద్ లో బుధవారం నుంచి జరుగుతోంది.
రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. విమలారామన్ బికినీ డ్రెస్ లో కనిపించనుండటం, తరుణ్ ఓ పాట పాడటం ప్రత్యేకతలుగా తెలుస్తోంది. హైద్రాబాద్ లో జరుగుతున్న తాజా షెడ్యూల్ లో షూటింగ్ పూర్తవుతుంది. నవంబర్ లో ఆడియో, డిసెంబర్ లో సినిమా రిలీజ్ కు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి వాసు సినిమాటోగ్రఫీ, గౌతంరాజు ఎడిటింగ్, అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|