వర్మ కూతురు మెడికో...
వివాహ వ్యవస్థ పట్ల తనకు నమ్మకం లేదని తరచు చెప్పే రామ్ గోపాల్ వర్మ కేవలం సినిమానే తన శ్వాస అన్నట్టు సినిమా వెంట సినిమా తీస్తూ అందరి దృష్టినీ ఆకట్టుకుంటూ ఉంటారు. హైద్రాబాద్ లో ఉన్న తన ఫ్యామిలీ గురించి ప్రస్తావించడానికి ఏమాత్రం ఇష్టపడరు. దీంతో వర్మ బ్యాచిలర్ అనుకునే వాళ్లూ ఉన్నారు. అయితే రామూకు ఓ ఫ్యామిలీ ఉందనీ, ఆమె కుమార్తె పేరు రేవతి అనీ ఇప్పుడు బయట ప్రపంచానికి కూడా తేటతెల్లమైంది.
రెండు పదుల ప్రాయం ఉన్న రేవతి మెడిసన్ చదువుతోంది. సర్జన్ కావాలనేది ఆమె కోరిక. తన తండ్రితో కూడా ఆమె టచ్ లోనే ఉన్నారట. వర్మ మేనల్లుడు (చెల్లెలు జ్యోతి కుమారుడు) సుమన్ వివాహం ఇటీవల హైద్రాబాద్ లో జరిగింది. 'రక్తచరిత్ర' షూటింగ్ కోసం ఇక్కడే ఉన్న వర్మ ఈ వివాహానికి హాజరై తన కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. అప్పుడే రేవతి కెమెరా కంటికి చిక్కారు. ఈ వివాహానికి వర్మ మాజీ భార్య రత్నశ్రీ, తల్లి సూర్యవతి కూడా హాజరయ్యారు.
Be first to comment on this News / Article!
|