'కార్తీక మాసం' వస్తోంది...
దీపావళి దాటితే వచ్చేది కార్తీక మాసం. కార్తీక మాసంలో నియమ నిష్టలతో పూజాదికాలు జరిపితే ఏడాది ఫలితం దక్కుతుందంటారు. కార్తీక మాసం ప్రత్యేకత, పంచరామ క్షేత్రాల ప్రాధాన్యతను వివరిస్తూ 'కార్తీక మాసం' చిత్రం కూడా ఈసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నరేష్, ప్రభా వల్లిక జంటగా నటించిన ఈ చిత్రానికి ఇటీవలే కన్నుమూసిన సీనియర్ డైరెక్టర్ గెద్దాడ అనందబాబు దర్శకత్వం వహించారు. మల్లికార్జున మూవీస్ పతాకంపై అనపర్తి శివరామకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ కార్తీకమాసంలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాత తెలిపారు.
కార్తీక మాసం గొప్పతనాన్ని తెలిపే చిత్రమిదనీ, దైవభక్తితో పాటు చక్కటి భావోద్వేగాళ మేళవింపుగా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించారనీ చెప్పారు. లక్ష్మీ వినాయక్ స్వరపరచిన 6 పాటలు వేటికవే ప్రత్యేకంగా ఉండి ప్రేక్షకులను అలరిస్తాయని అన్నారు. నటుడు తణికెళ్ల భరణి పాడిన 'భాగ్యలక్ష్మీ...రావే' పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి కార్తీకమాసంలోనే సినిమా విడుదలకు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో తనికెళ్ల భరణి. రామిరెడ్డి, నర్రా వెంకటేశ్వరరావు, కొండవలస తదితరులు నటించారు. జోగారావు ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు.
Be first to comment on this News / Article!
|