'జగన్మోహిని'కి లైన్ క్లియర్
నమిత అభిమానులు ఇది నిజంగా శుభవార్తే. నమిత టైటిల్ పాత్ర పోషించిన 'జగన్మోహిని' చిత్రం ముందుగా అనుకున్న ప్రకారమే దీపావళి కానుకగా ఈనెల 17న తమిళ, తెలుగు భాషల్లో విడుదలకు లైన్ క్లియర్ అయింది. చిత్ర నిర్మాత హెచ్.మురళి తనకు 4 లక్షలు బకాయి పడ్డారంటూ డిస్ట్రిబ్యూటర్ కమ్ ఫైనాన్షియర్ అళగప్పన్ గత మంగళవారంనాడు మద్రాసు హైకోర్టును ఆశ్రయించడంతో సినిమా విడుదలపై కోర్టు స్టే ఇచ్చి తదుపరి విచారణను ఈ గురువారానికి వాయిదా వేసింది. తాజాగా మురళి, అళగప్పన్ మధ్య కోర్టు బయటే ఒక పరిష్కారం కుదిరిందనీ, దీంతో తన క్లయిం ట్ ఈ కేసును ఉపసంహరించుకున్నారనీ అళగప్పన్ తరఫు న్యాయవాది గురవారంనాడు తెలియజేశారు. సినిమా విడుదల, ప్రింట్లు డెలివరీకి తన క్లయింట్ కు ఎలాంటి అభ్యంతరాలు లేవని ఆయన కోర్టుకు తెలియజేశారు. ఈమేరకు ఒక లేఖ ప్రతిని జెమినీ కలర్ లేబొరేటరీకి కూడా పంపారు. దీంతో 'జగన్మోహిని' విడుదలకు మార్గం సుగమమైంది.
తెలుగులో కంటే తమిళనాట నమితకు ఉన్న ఫాలోయింగ్ కారణంగా 'జగన్మోహిని' చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. తెలుగు, తమిళ నటీనటులు ఈ ద్విభాషా చిత్రంలో నటించారు. రాజా, మీరాచోప్రా, కోట శ్రీనివాసరావు, ఆలీ, వడివేలు, జ్యోతిలక్ష్మి, నరసింహరాజు వంటి పలువురు ఈ చిత్రంలో నటించారు. 70-80 దశకంలో జయమాలిని ప్రధాన పాత్ర పోషించగా కె.విఠలాచార్య దర్శకత్వంలో విజయవంతమైన 'జగన్మోహిని' చిత్రానికి మోడ్రన్ వెర్షన్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు ఎస్.కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. ఇళయరాజా సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|