విక్రమ్ తో శ్రీ రాఘువ చిత్రం
విక్రమ్ ('మల్లన్న' ఫేమ్) కథానాయకుడుగా శ్రీ రాఘువ (సెల్వ రాఘువన్) దర్శకత్వంలో కనకరత్న మూవీస్ పతాకంపై శింగనమల రమేష్ ఓ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈనెల 18న ఈ చిత్రం ప్రారంభమవుతుందని చిత్ర యూనిట్ తెలిపింది.
హీరో విక్రమ్ మాట్లాడుతూ, శ్రీ రాఘవ చాలా మంచి దర్శకుడనీ, ఆయన చెప్పిన కథ నచ్చి వెంటనే ఈ చిత్రం చేస్తున్నాననీ చెప్పారు. తన కెరీర్ లో ఇదో డిఫరెంట్ కమర్షియల్ చిత్రమవుతుందనీ, శింగనమల రమేష్ బ్యానర్ నుంచి వస్తున్న ఈ భారీ చిత్రంలో నటిస్తుండటం సంతోషంగా ఉందనీ అన్నారు. శింగనమల రమేష్ మాట్లాడుతూ, ఈనెల 19 నుంచి 3 వరకూ లడక్ లో ఈ చిత్రం షెడ్యూల్ జరుగుతుందనీ, నవంబర్ 5 నుంచి హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తామనీ చెప్పారు. విక్రమ్ కెరీర్ లో ఇదో సెన్సేషనల్ ఫిలిమ్ గా దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నారని తెలిపారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నట్టు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బి.బుల్లి సుబ్బారావు తెలిపారు. షారూక్ ఖాన్ హిందీ 'దేవదాసు' చిత్రానికి సంగీతం అందించిన ఇస్మాయిల్ దర్బార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారనీ, విక్రమ్ సరసన 'కలర్స్' స్వాతి ఓ హీరోయిన్ గా, ఆంగ్రో ఇండియన్ ఆండ్రియా మరో హీరోయిన్ గా నటిస్తున్నట్టు చెప్పారు. కథ-స్క్రీన్ ప్లే సైతం శ్రీరాఘువ అందిస్తున్న ఈ చిత్రానికి రాంజీ సినిమాటోగ్రఫీ, రాఘవన్ కళా దర్శకత్వం, కోలా భాస్కర్ ఎడిటింగ్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|