ఫిల్మ్ సిటీలో 'సింహా'
యువరత్న బాలకృష్ణ కథానాయకుడుగా యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తున్న భారీ చిత్రం 'సింహా'. బోయపాటి శ్రీను దర్శకుడు. స్నేహ ఉల్లాల్, నమిత హీరోయిన్లు. ఈ చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.
పరుచూరి కీరీటి ఆ విశేషాలను తెలియజేస్తూ, ఫిల్మ్ సిటీలో ఎ.ఎస్.ప్రకాష్ కళాదర్శకత్వంలో వేసిన మూడు భారీ సెట్స్ లో బాలకృష్ణ, నమిత జంటపై ఓ పాటను చిత్రీకరిస్తున్నామనీ, దీనికి ప్రేమ్ రక్షత్ కొరియోగ్రఫీ అందిస్తున్నారనీ తెలిపారు. ఈ నెలాఖరులో ఇక్కడే మరో మూడు భారీ సెట్స్ వేసి బాలకృష్ణ, స్నేహ ఉల్లాల్ పై మరో పాటను తీయబోతున్నట్టు చెప్పారు. ఏకధాటిగా హైద్రాబాద్, వైజాగ్ లలో జరిగే షూటింగ్ తో సినిమా పూర్తవుతుందని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బి.మహేంద్రబాబు తెలిపారు. 2010 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో రఘు, కోట శ్రీనివాసరావు, ఆదిత్య మీనన్, కెఆర్ విజయ, బ్రహ్మానందం, వేణుమాధవ్, ఆలీ, ధర్మవరపు, కృష్ణ భగవాన్, ఎల్బీ శ్రీరాం, ఝాన్సీ, సైరాబాను, వినోద్, ప్రముఖ మలయాళ విలన్ సాయికుమార్ నటిస్తున్నారు. కథ-స్క్రీన్ ప్లే-మాటలు సైతం బోయపాటి శ్రీను అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్దర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ, స్టన్ శివ ఫైట్, ఎ.ఎస్.ప్రకాష్ కళాదర్శకత్వం, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, చక్రి సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|