'కథ' ఆడియో విడుదల
'బొమ్మరిల్లు' చిత్రంలో హాసినిగా యువ ప్రేక్షకులను అలరించిన జెనీలియా తాజాగా తెలుగులో ప్రేమకథాంశంతో కూడిన థ్రిలర్ చిత్రం 'కథ'లో నటిస్తోంది. అరుణ్ హీరోగా పరిచయమవుతున్నారు. జస్ట్ ఎల్లో సినిమా పతాకంపై గుణ్ణం గంగరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా శ్రీనివాస్ రాగ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం ఆడియో వేడుక సోమవారం రాత్రి హైదరాబాద్ లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో జరిగింది. కె.రాఘవేంద్రరావు, రాజసింహ చేతుల మీదుగా ఆడియో సీడీని ఎస్.యం.ఎస్ పోటీలో గెలుపొందిన రాజుకు అందజేశారు. అతని చేతుల మీదుగా తొలి పాట ఆవిష్కరింపబడింది. రెండవ సీడీని ఎస్.యం.ఎస్ పోటీలో గెలుపొందిన శ్రావణ్ కు ఎన్.టీ.ఆర్, రాఘవేంద్రరావు చేతుల మీదుగా అందజేశారు. మూడవ సీడీని ఎన్.టి.ఆర్ ప్రకాష్ రాజ్ లు పోటీలు గెలుపొందిన బాలుకు అందజేయగా మూడవ పాటను ఆవిష్కరించారు. నాలుగవ సీడీని కె.బాలచంద్రన్, ప్రకాష్ రాజ్ ల చేతుల మీదుగా అమిత్, ఉదయ్ లకు అందజేయగా, నాలుగవ పాటను వారు ఆవిష్కరించారు. వేల్ రికార్డ్స్ ఈ ఆడియోను మార్కెట్ చేస్తోంది.
ఆద్యంతం ఈ వేడుకను విభిన్నంగా నిర్వహించారు. దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి వ్యాఖ్యానం ఎంతగానో ఆకట్టుకుంది. వేదికపైకి పలువురు సినీ ప్రముఖులతో పాటు ఇతర ప్రముకులను కూడా నాలుగు బ్యాచ్ లుగా పిలిచి వారికి మూడు పదాలను ఇచ్చి వాటిని జతచేస్తూ కథలను చెప్పించారు. వారంతా తమ ఊహాగానంతో రకరకాల కథలను వినిపించడం అందరినీ అలరింపచేసింది. ఈ కార్యక్రమంలో కె.రాంఘవేంద్రరావు, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్.టి.ఆర్, కృష్ణవంశీ, డా.కె.యల్.నారాయణ, ప్రకాష్ రాజ్, డి.సురేష్ బాబు, గుణ్ణం గంగరాజు, ఊర్మిళ గుణ్ణం కీరవాణి, బొమ్మరిల్లు భాస్కర్, అనంత శ్రీరామ్, అరుణ్ ఆదిత్, జెనీలియా, చిత్ర దర్శకుడు శ్రీనివాస్, రాగ సంగీత దర్శకుడు యస్ కె.బాలచంద్రన్, డా.గురవారెడ్డి, రఘుబాబు, రాజసింహ తదితరులు పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|