బెండు అప్పారావు సక్సెస్ మీట్
అల్లరి నరేష్, కామ్న జెఠ్మలాని, మేఘన హీరోహీరోయిన్లుగా శ్రీసురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన బెండు అప్పారావు మౌత్ టాక్ తో విజయవంతంగా దూసుకుపోతోందని నిర్మాత డి.రామానాయుడు అన్నారు. సోమవారం రాత్రి హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో జరిగిన సక్సెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ గతంలో మా సంస్థలో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయని, అయితే ఈ చిత్ర విజయాన్ని ఓ ప్రత్యేకమైనదిగా భావిస్తున్నానని అన్నారు. ఆడియో విడదల సందర్భంలో నేను అనుట్టుగానే నరేష్ కెరీర్ లో ఇదో పెద్ద హిట్ చిత్రం కాబోతున్నదని అన్నారు.
అల్లరి నరేష్ మాట్లాడుతూ, మా నాన్నకు, అన్నయ్యకు, నాకు కెరీర్ పరంగా రామానాయుడుగారు బ్రేక్ ని ఇచ్చారనీ, ఒక్క మాటలో చెప్పాలంటే మా కుటుంబానికి ఆయన గాడ్ ఫాడర్ లాంటివారు అని అన్నారు. నా చిత్రాలలో భారీ ఓపెనింగ్స్ వచ్చిన చిత్రదని నరేష్ చెప్పారు. కలెక్షన్ల పరంగా, కామేడీ మగధీరగా ఈ చిత్రాన్ని అభివర్ణించవచ్చునని నటుడు ఏవీఎస్ పేర్కొన్నారు. ఆహుతిప్రసాద్ మాట్లాడుతూ ప్లానింగ్, కమిట్ మెంట్ ఉన్న నిర్మాతగా రామానాయుడు బేనర్ లో ఓ మంచి పాత్రను పోషించే అవకాశం లభించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ సక్సెస్ మీట్ లో నటులు చలపతిరావు, రఘుబాబు, అనంత్, గౌతంరాజు, నటి అనిత, ఎడిటర్ గౌతం రాజు, గీత రచయిత చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|