రామ్ చరణ్ చిత్రం ప్రారంభం
భాస్కర్ మాట్లాడుతూ, ఇదొక చక్కటి ఎంటర్ టైనర్ అనీ, చరణ్ ను ఇందులో కొత్తగా చూపించబోతున్నామనీ అన్నారు. కెమెరామన్ కిరణ్ రెడ్డి, తానూ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో సహ విద్యార్థులమనీ, హారిస్ జైరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారనీ అన్నారు. నాగబాబు వంటి నిర్మాత ఉండటం ఈ ప్రాజెక్ట్ కు మంచి సపోర్ట్ అనీ, ఆయన కోసం ఇంకొంచెం ఎక్కువగా కష్టపడతాననీ అన్నారు. ఈ చిత్రంతో తనకు కూడా హ్యాట్రిక్ కావాలనీ, చరణ్ కు కూడా హ్యాట్రిక్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా తనపై ఉందనీ, ఆ దిశగా తాను కష్టపడతాననీ పేర్కొన్నారు. రామ్ చరణ్ మాట్లాడుతూ, 'మగధీర' విడుదలైన 40 రోజుల తర్వాత ఈ ప్రాజెక్ట్ కోసం అంతా కలిసామనీ, ఒక విలక్షణ ఆర్టిస్టుగా అనిపించుకోవాలనే తపనతో చేస్తున్న సినిమా ఇదనీ, దర్శకుడు భాస్కర్ మంచి సమర్ధుడు కావడంతో ఆయనతో పనిచేయాలని అనుకున్నాననీ అన్నారు. ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయనీ, కష్టపడి నటించి మెప్పిస్తాననీ అన్నారు. ఇదొక ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్ అని కెమెరామన్ కిరణ్ రెడ్డి అన్నారు.
నటీనటుల ఎంపిక జరుగుతున్న ఈ చిత్రానికి తోట ప్రసాద్ మాటలు, కిరణ్ రెడ్డి సినిమాటోగ్రఫీ, ఆనంద్ సాయి ఆర్ట్, పీటర్ హెయిన్స్ ఫైట్స్, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ అందిస్తున్నారు. మన్యం రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|