సునీత పాత్రలో రాధిక ఆప్టే
పరిటాల రవి జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న 'రక్తచరిత్ర' చిత్రం హైద్రాబాద్ లో ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటోంది. హైద్రాబాద్ తో పాటు అనంతరపురం పరిసర ప్రాంతాల్లోనూ ఈ చిత్రం షూటింగ్ కు వర్మ ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రంలో పరిటాల రవి పాత్రలో వివేక్ ఒబెరాయ్, మద్దెల చెరువు సూరి పాత్రలో తమిళ హీరో సూర్య నటిస్తున్నారు. పరిటాల రవి సతీమణి పరిటాల సునీత పాత్రకు ముంబైకి చెందిన రాధిక ఆప్టేను వర్మ ఎంపిక చేసినట్టు సమాచారం. తొలుత ఈ పాత్రలో కంగనా రనౌత్ ను ఎంపిక చేసే అవకాశాలున్నట్టు వినిపించినా ఇప్పటికే కంగనకు ఉన్న గ్లామర్ డాల్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని కొత్తమ్మాయిల పేర్లు పరిశీలించిన వర్మ చివరకు రాధిక ఆప్టేను ఎంచుకున్నారు. పరిటాల సునీత వీడియోలు చూపించి ఆమెకు దగ్గరగా బాడీ లాంగ్వేజ్ ను అలవరుచుకోవాలని కూడా వర్మ సూచించినట్టు తెలుస్తోంది.
యదార్ధ సంఘటనతో ప్రభావితమైన ఒక కల్పిత గాథగా ఈ చిత్రాన్ని 'రక్తచరిత్ర 1', 'రక్తచరిత్ర 2'గా తీయబోతున్నారు. తొలి పార్ట్ విడుదలైన ఒకటి రెండు వారాల్లోనే రెండో పార్ట్ కూడా విడుదలవుతుంది. సీనర్జి పతాకంపై మధు మంతెన, శీతల్ వినోద్ తల్వార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|