చెర్రీపై సిటీ అమ్మాయి కన్ను
ఇవాల్టి కొత్తతరం అమ్మాయిలకు తమ కెరీర్ ను ఎలా మలుచుకోవాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోడలింగ్ నుంచి బాలీవుడ్ లో కి కూడా అడుగుపెడుతున్న హైద్రాబాదీ ముద్దుగుమ్మ శౌర్య చౌహాన్ తన యాక్టింగ్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటోంది. ఆమె రాష్ట్ర స్థాయి జిమ్నాస్టిక్ ప్లేయర్ కూడా కావడం విశేషం. వృత్తిపరమైన కారణాల వల్లే తాను ముంబై వెళ్లినప్పటికీ పుట్టిపెరిగిన హైద్రాబాద్ అంటే తనకెంతో ఇష్టమని శౌర్య చెబుతోంది. ఈమధ్యనే ఆమె స్విమ్ షూట్ క్యాలెండర్ గాళ్ గా కూడా పాపులర్ కావడంతో బాలీవుడ్ లో కూడా ఆవకాశం తలుపుతట్టింది. ప్రస్తుతం ఆమె హిమేష్ రేషమ్మియా సరసన 'రైట్ య రాంగ్' చిత్రంతో బాలీవుడ్ లోకి కూడా అడుగుపెడుతోంది. ఇదే సమయంలో టాలీవుడ్ లో అడుగుపెట్టే ఆలోచనను కూడా ఆమె బయట పెట్టింది.
'దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో రామ్ చరణ్ అంటే నాకెంతో ఇష్టం. ఒకరకంగా నేను ఆ ఇద్దరి ఫ్యాన్ ని. ఏదో ఒకరోజు ఆ ఇద్దరితో కలిసి పనిచేసే అవకాశం వస్తుందనే ఆశాభావంతో ఉన్నాను' అంటూ శౌర్య తన మనసులోని మాట బయటపెట్టింది. ప్రస్తుతం యాడ్ కాంపైన్లు, రంగస్థలానికి చెందిన ప్రాజెక్టులు, సినిమాలపై ఆమె దృష్టిసారిస్తోంది. అయితే ఇదే ఆర్డర్ లో ఆమె ప్రాధాన్యతా క్రమాలు ఉంటాయని అనుకోనవసరం లేదు. బిగ్ స్క్రీన్ మోజే వేరు కదా. మరి శౌర్య కోరికను పూరీ, రామ్ చరణ్ తీరుస్తారేమో చూడాల్సిందే.
Be first to comment on this News / Article!
|