'అరుంధతి'కి అవార్డుల పంట
అవార్డు విజేతల్లో...
ఉత్తమ దర్శకుడుగా జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్), ఉత్తమ నటుడుగా రవితేజ (నేనింతే), ఉత్తమ నటిగా స్వాతి (అష్టాచమ్మ), ఉత్తమ సహాయనటుడుగా అల్లరి నరేష్ (గమ్యం), ఉత్తమ సహాయ నటిగా రక్ష (నచ్చావులే), ఉత్తమ క్యారెక్టర్ నటుడుగా (గుమ్మడి అవార్డు) ముక్కురాజు (1940లో ఒక గ్రామం), ఉత్తమ హాస్యనటుడుగా బ్రహ్మానందం (రెడీ), ఉత్తమ విలన్ గా సోనూసూద్ (అరుంధతి), ఉత్తమ బాలనటుడుగా భరత్ (రెడీ), ఉత్తమ బాలనటిగా దివ్య నగేష్ (అరుంధతి), ఉత్తమ తొలిచిత్ర దర్శకుడుగా సాయి కిరణ్ అడవి (వినాయకుడు), ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా ఎ.కె.కరుణాకర్ (ఉల్లాసంగా ఉత్సాహంగా), ఉత్తమ కథా రచయితగా ఆర్.పి.పట్నాయక్ (అందమైన మనసులో), ఉత్తమ సంభాషణల రచయితగా పూరీ జగన్నాథ్ (నేనింతే), ఉత్తమ గేయ రచయితగా సిరివెన్నెల (గమ్యం - ఎంతవరకో...), ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా ఛోటా కె.నాయుడు (కొత్త బంగారులోకం), ఉత్తమ సంగీత దర్శకుడుగా మిక్కీ జె.మేయర్ (కొత్త బంగారులోకం), ఉత్తమ నేపథ్య గాయకుడుగా శంకర్ మహదేవన్ (వెంకటాద్రి), ఉత్తమ నేపథ్య గాయనిగా గీతా మాధురి (నచ్చావులే...నిన్నే నిన్నే), ఉత్తమ ఎడిటర్ గా మార్తాండ్ కె.వెంకటేష్ ( అరుంధతి), ఉత్తమ కళాదర్శకుడుగా అశోక్ (అరుంధతి), ఉత్తమ కొరియోగ్రాఫర్ గా ప్రేమ్ రక్షిత్ (కంత్రి), ఉత్తమ ఆడియో గ్రాఫర్ గా రాధాకృష్ణ-మధుసూదన్ రెడ్డి (అరుంధతి), ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనర్ గా దీప చందర్ (అరుంధతి), ఉత్తమ మేకప్ ఆర్టిస్టుగా రమేష్ మహంతి (అరుంధతి), ఉత్తమ ఫైట్ మాస్టర్ గా రామ్-లక్ష్మణ్ (నేనింతే), ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా పి.రవిశంకర్ (అరుంధతి), ఉత్తమ డబ్బింగ్ కళాకారిణిగా ఆర్.హరిత (నచ్చావులే), ఉత్తమ స్పెషల్ ఎఫెక్స్ట్ కు రాహుల్ నంబియార్ (అరుంధతి) ఎంపికయ్యారు.
అనుష్క...అల్లు అర్జున్..సుశీల
'అరుంధతి' చిత్రంలో నటనకు గాను అనుష్క, 'పరుగు'లో నటనకు గాను అల్లు అర్జున్, 1940లో ఒక గ్రామం చిత్రంలో పాటకు గాను శ్రీమతి సుశీల స్పెషల్ జ్యూరీ అవార్డులకు ఎంపికయ్యారు. 'ఆరుద్ర సినీ మినీ కబుర్లు' పుస్తకానికి గాను డాక్టర్ రామలక్ష్మి ఆరుద్ర రాసిన పుస్తకానికి తెలుగు సినిమాపై ఉత్తమ పుస్తకం అవార్డు లభించింది. ఉత్తమ సినీ విమర్శకుడుగా పర్చా శరత్ కుమార్ ఎంపికయ్యారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|