అరుణ్ ప్రసాద్ 'ఎలెవెన్'
కొందరు దర్శకులు మాటల కంటే చేతలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. పవన్ కల్యాణ్ 'తమ్ముడు', నవదీప్ తో 'గౌతమ్ ఎస్.ఎస్.సి.' వంటి సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు అరుణ్ ప్రసాద్ ఇప్పుడు అంతే పట్టుదలతో వరుస చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ తన సత్తా చాటుకోబోతున్నారు. ఆయన దర్శకత్వం వహించిన రెండు చిత్రాలు నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉండగో, మరో కొత్త చిత్రానికి కూడా ఆయన సన్నాహాలు చేస్తున్నారు.
అరుణ్ కుమార్ దర్శకత్వంలో 'యాగం', 'మా నాన్న చిరంజీవి' చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందాల నటి భూమిక, నవదీప్ జంటగా 'యాగం' తెరకెక్కింది. బాలీవుడ్ సెక్సీ బ్యూటీ కిమ్ శర్మ మరో కథానాయిక. జగపతిబాబు కథానాయకుడుగా 'మా నాన్న చిరంజీవి' (అంటే ఓ పెద్ద హీరో) చిత్రం తెరకెక్కింది. త్వరలోనే ఈ రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. తాజాగా ఆయన 'ఎలెవెన్' అనే ఆలోచింపజేసే టైటిల్ తో మరో కొత్త చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రానికి ఆయన ప్లాన్ చేస్తున్నారు. నవదీప్, శ్రీరామ్ ఇందులో హీరోలుగా నటించనున్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.
Be first to comment on this News / Article!
|