'ఆర్య-2' ఆడియో రిలీజ్
నిర్మాత ఆదిత్య బాబు మాట్లాడుతూ, 'ఆర్య-2' ఎంతమాత్రం 'ఆర్య'కు సీక్వెల్ కాదనీ, పూర్తి భిన్నమైన సినిమా అనీ అన్నారు. హీరో పాత్ర మినహా కథ కానీ, ఇతర పాత్రలు కానీ ఆర్యతో సంబంధం లేకుండా ఉంటాయని అన్నారు. అల్లు అర్జున్ విజృంభించి నటించాడనీ, సుకుమార్ గురించి తాను చెప్పడం కంటే ఆడియెన్సే చెబుతారని అన్నారు. సినిమా చాలా బాగా వచ్చిందనీ, ప్రతి ఒక్కరు పూర్తి స్థాయిలోకష్టపడి పనిచేసారనీ చెప్పారు. దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ, తన గత చిత్రం 'జగడం' నిరుత్సాహ పరిచిందనీ, ఆ సమయంలో తనకు ఓదార్పు ఇచ్చి ఓ మంచి హిట్ నీకోసం ఎదురుచూస్తోందని చెప్పిన రాజమౌళికి తన కృతజ్ఞతలనీ అన్నారు. కష్టకాలంలో తనకు భోగవల్లి ప్రసాద్ అండగా నిలబడ్డారని అన్నారు. అలాగే కథ చెప్పగానే అల్లు అర్జున్ అంగీకరించారనీ, ఈ చిత్రం అన్ని వర్గాల ఆడియెన్స్ ను అలరిస్తుందని నిశ్చయంగా చెప్పగలననీ అన్నారు.
'ఆర్య-2' టీమ్ తో పనిచేయడం చాలా సంతోషం కలిగించిందనీ, డైరెక్టర్ సుకుమార్తో పాటు అల్లు అర్జున్, శ్రద్ధాదాస్, నవదీప్ లతో ఎంజాయ్ చేస్తూ పని చేశాననీ నటి కాజల్ అన్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ, సుకుమార్ తన గురించి పొడిగేశారనీ, నిజానికి తనకంత సీన్ లేదనీ, ఆర్య అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ సుకుమార్ దేననీ అన్నారు. ఇద్దరు హీరోలు కలిసి పనిచేస్తే అభిప్రాయభేదాలు వస్తాయనే ఓ అభిప్రాయం ఉందనీ, నవదీప్ తో కలిసి ఎంజాయ్ చేస్తూ పనిచేశాననీ చెప్పారు. ఈ చిత్రం ఇంత బాగా రావడానికి తనతో పాటు భోగవల్లి ప్రసాద్, సుకుమర్, దేవీశ్రీ ప్రసాద్ , సినిమాటోగ్రాఫర్ రాజశేఖర్ కారకులని అన్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నానట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సుమ వ్యాఖ్యాతగా వ్యవహించారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|