రానా 'లీడర్' రెడీ..
మూవీ మొఘల్ డాక్టర్ డి.రామానాయుడు మనువడు రానా హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'లీడర్'. ప్రతిష్ఠాత్మక ఏవియం బ్యానర్ బ్యానర్ పై రూపొందుతున్న 174వ చిత్రమిది. శేఖర్ కమ్ముల దర్శత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నెలాఖరులో ఆడియో విడుదల చేస్తున్న చిత్ర నిర్మాతలు ఎం.శరవణన్, ఎం.ఎస్.గుహన్, అరుణ గుహన్, అపర్ణ గురువారంనాడు తెలిపారు.
ఒక విభిన్నమైన ఇతివృత్తంతో శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కించారనీ, 'హ్యాపీడేస్' తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో సహజంగానే మంచి అంచనాలు ఉన్నాయనీ, ఆ అంచనాలకు తగ్గట్టుగా ఈచిత్రం ఉంటుందనీ తెలిపారు. నెలాఖరులో ఆడియో విడుదల చేసి, డిసెంబర్ చివర్లో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. రీచా గంగోపాధ్యాయ్, ప్రియా ఆనంద్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, సుహాసిని, హర్షవర్దన్, తనికెళ్ భరణి, సుబ్బరాజు, రావురమేష్ తదితరులు నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల కథ-స్క్రీన్ ప్లే-మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి వేటూరి పాటలు, విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ, తోట తరణి ఆర్ట్, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్, మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|