పబ్ లో ఎన్టీఆర్ చిందు
'కంత్రీ' తర్వాత ఎన్టీఆర్ కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న అభిమానులను డిసెంబర్ మూడోవారంలో ఆయన తన కొత్తచిత్రంలో అలరించబోతున్నారు. ఇందులో బాగంగానే ఎన్టీఆర్-వి.వి.వినాయక్ కాంబినేషన్ లో రూపొందుతున్న 'అదుర్స్' చిత్రం చివరి పాట అన్నపూర్ణా స్టూడియోస్ లో ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటోంది. ప్రత్యేకంగా వేసిన పబ్ సెట్ లో చిత్రీకరిస్తున్న ఈ పాటలో ఎన్టీఆర్ తో పాటు చిత్ర కథానాయికలైన నయనతార, షీలా పాల్గొంటున్నారు.
వారం రోజుల పాటు జరిగే ఈ పాట చిత్రీకరణతో షూటింగ్ పూర్తవుతుందని నిర్మాత వల్లనేని వంశీ తెలిపారు. ఎన్టీఆర్, వినాయక్ కాంబనేషన్ లో వస్తున్న మూడో చిత్రమిదనీ, ప్రేక్షకుల అంచనాలకు ధీటుగా ఎన్టీఆర్, వినాయక్ కెరీర్ లో ఓ ల్యాండ్ మార్క్ చిత్రంగా ఇది ఉంటుందనీ చెప్పారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఎక్స్ టార్డినరీగా ఉంటుందన్నారు. ఈనెల మూడోవారంలో ఆడియో, డిసెంబర్ మూడో వారంలో సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో మహేష్ మంజ్రేకర్, సాయాజీ షిండే, నాజర్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మాందం, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కోన వెంకట్ కథ-మాటలు, ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ, ఆనంద సాయి కళాదర్శకత్వం వహిస్తున్నారు. కొడాలి నాని చిత్ర సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|