'రింగా రింగా' మానియా...
పాటలు, సంగీతానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ పట్టం కడుతుంటారు. సాంగ్స్ ఇచ్చే కిక్ ను బట్టి సినిమాపై క్రేజ్ పెంచుకుంటారు. అల్లు అర్జున్ 'ఆర్య' చిత్రంలోని పాటలు అప్పట్లో ప్రేక్షకులను ఉర్రూతలూగించినట్టే ఇప్పుడు 'ఆర్య 2' పాటలు కూడా అంతటా మార్మోగుతున్నాయి. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నింటికీ మంచి రెస్పాన్స్ వస్తోంది. వీటన్నింటిలోనూ 'రింగా రింగా' సాంగ్ చార్ట్ బస్టర్ల లో టాప్ ప్లేస్ ఆక్రమించుకుంది.
'అమ్మా లేదు నాన్నా లేడు' (ఏక్ నిరంజన్), 'రావణమ్మా' (బంపర్ ఆఫర్) పాటలు ఇటీవల సంగీత ప్రియులను ఉర్రూతలూగించి ఆయా సినిమాల ఓపినింగ్స్ పై మంచి ప్రభావం చూపించాయి. ఇప్పుడు ఆ ప్లేస్ ను 'రింగా రింగా' ఆక్రమించింది. ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. సినిమా విడుదలకు ముందే ఆడియో హిట్టయితే సినిమా సగం సక్సెస్ అయినట్టేనని ఫిల్మ్ మేకర్స్ బలంగా నమ్ముతుంటారు. ఆడియో అమ్మకాల్లో 'ఆర్య-2' చరిత్ర సృష్టిస్తోందనీ, ఇది సినిమా సక్సెస్ పై తమ అంచనాలను మరింత పెంచిందనీ చిత్ర నిర్మాత ఆదిత్యబాబు బాబు తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఈనెల చివరి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అల్లు అర్జున్, కాజల్ తొలిసారి జంటగా నటించిన ఈ చిత్రంలో నవదీప్, శ్రద్ధాదాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహించారు.
Be first to comment on this News / Article!
|