'ఓంశాంతి' లోగో 18న
నవదీప్, నిఖిల్, కాజల్ అగర్వాల్, బిందుమాధవి, అదితి శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'ఓం శాంతి'. త్రీ ఎంజిల్స్ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శేషు ప్రియాంక చలసాని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నారా రోహిత్ తో 'బాణం' చిత్రం తర్వాత ఈ బ్యానర్ నుంచి వస్తున్న రెండో చిత్రమిది. ఈ చిత్రం ద్వారా ప్రకాష్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా నిర్మాణం జరుపుకొంటోంది.
తమ తొలి చిత్రం తరహాలోనే వైవిధ్యమైన కథా కథనాలతో ఈ చిత్రం రూపొందుతోందనీ, టైటిల్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం ఈనెల 18న జరుగుతుందనీ శేషు ప్రియాంక తెలిపారు. ఈ చిత్రానికి ఇళయరాజా అద్భుతమైన సంగీతం అందించారనీ, ఇదే నెల 27న ఆడియో విడుదలవుతుందనీ చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో మురళీ మోహన్, రవి కాలే, రోహిత్ పాఠక్, రఘుబాబు, సునీల్, సుమన్ శెట్టి, ప్రగతి, రణధీర్, శివారెడ్డి, సారిక రామచంద్రరావు నటిస్తున్నారు. కథ-స్క్రీన్ ప్లే సైతం ప్రకాష్ అందిస్తున్న ఈ చిత్రానికి నాగరాజు గంధం మాటలు, జయనన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ, రామ్ లక్ష్మణ్ - జాని సెబాస్టియన్ ఫైట్స్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|